మహానుభావుడు రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

మహానుభావుడు రివ్యూ

Murali R | Published:September 29, 2017, 1:16 PM IST

మహానుభావుడు రివ్యూ 
నటీనటులు : శర్వానంద్ , మెహరీన్ కౌర్ , నాజర్ , వెన్నెల కిషోర్ తదితరులు 
సంగీతం : ఎస్ ఎస్ థమన్ 
నిర్మాతలు : వంశీ కృష్ణారెడ్డి , ప్రమోద్ 
దర్శకత్వం : మారుతి 
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2017


 

Editor Review
అగ్ర హీరోలతో పోటీపడి మరీ విజయాలను అందుకుంటున్న హీరో శర్వానంద్ . గత రెండేళ్లుగా ఇదే జోరు చూపిస్తున్నాడు , ఇక తాజాగా మరోసారి స్టార్స్ తో వార్ చేయడానికి వచ్చాడు మహానుభావుడు చిత్రంతో . మరి ఈ సినిమా తో ప్రేక్షకులను అలరించాడా ? తన జోరు చూపించాడా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
అతిగా శుభ్రత పాటించే ఆనంద్ ( శర్వానంద్ ) ఓ సీడీ అనే వ్యాధితో బాధపడే వ్యక్తి . పైగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా . తొలిచూపులోనే మేఘన ని చూసి ప్రేమలో పడతాడు . ఆనంద్ అంటే మేఘన కు ఇష్టమే అయినప్పటికీ తండ్రి ఒప్పుకుంటేనే పెళ్లి అని కండీషన్ పెడుతుంది . దాంతో రామాపురం గ్రామపెద్ద అయిన రామరాజు కి ఆనంద్ ని పరిచయం చేస్తుంది . అయితే ఆనంద్ అనే వ్యక్తి అతి శుభ్రత నచ్చక పోవడంతో పెళ్ళికి నిరాకరిస్తాడు , కానీ అదే సమయంలో రామరాజు వద్ద నుండి దొంగిలించబడిన బ్యాగ్ ని ఫైట్ చేసి రామరాజు మెప్పు పొందుతాడు ఆనంద్ . అయితే  మేఘన తండ్రి రామరాజు అనారోగ్యానికి గురి కావడంతో నీట్ నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన ఆనంద్ హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా మధ్యలోనే వదిలివేయడంతో అసహ్యించుకున్న మేఘన తనకి ఆనంద్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెబుతుంది . అయితే అనూహ్యంగా ఆనంద్ ని తన గ్రామమైన రామాపురం కు తీసుకెళ్లాల్సి వస్తుంది . అక్కడ ఏం జరిగింది ? చివరకు ఆనంద్ - మేఘన ల ప్రేమ ఫలించిందా ? అతి శుభ్రత పాటించే ఆనంద్ మారాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
శర్వానంద్ 
మెహరీన్ గ్లామర్ 
ఎంటర్ టైన్ మెంట్ 
సినిమాటోగ్రఫీ 
 
డ్రా బ్యాక్స్ : 
 
రొటీన్ స్టోరీ 
 
నటీనటుల ప్రతిభ : 
 
అతి శుభ్రత కు బ్రాండ్ అంబాసిడర్ గా ఆనంద్ పాత్రలో శర్వానంద్ నటన చాలా బాగుంది . తన అతి శుభ్రం తో ప్రేక్షకులను తెగ నవ్వించాడు శర్వా, విభిన్న చిత్రాలను చేస్తూ , విభిన్న పాత్రలను పోషిస్తూ సినిమా సినిమాకి ఎదుగుతున్నాడు  . హీరోయిన్ మెహరీన్ కౌర్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది , అలాగే నటనతో కూడా ఆకట్టుకుంది . వెన్నెల కిషోర్ కూడా బాగా నవ్వించాడు . నాజర్ పాత్ర హుందాగా ఉంది , అలాగే మిగిలిన పాత్రలలో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
ఎస్ ఎస్ థమన్ అందించిన పాటలలో మూడు బాగున్నాయి అలాగే నేపథ్య సంగీతం కూడా బాగుంది . ముఖ్యం గా మహానుభావుడవేరా ...... అనే పాట అలరిస్తుంది . నిజర్ షఫీ ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . ఇక యువి క్రియేషన్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి . ఇక దర్శకుడు మారుతి విషయానికి వస్తే ...... బాబు బంగారం వంటి ప్లాప్ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకొని చేసిన సినిమా ఈ మహానుభావుడు . కథలో కొంతవరకు భలే భలే మగాడివోయ్ పోలికలలా కనిపిస్తున్నప్పటికీ ........ అతి శుభ్రత తో బాగా నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు మారుతి . ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందించి భేష్ అనిపించాడు . అయితే కొత్తదనం లేదు అన్న మాట తప్ప డబ్బులు పెట్టి థియేటర్ కు వచ్చిన వాళ్ళని సీట్లో కూర్చోబెట్టగలిగే సినిమా ఈ మహానుభావుడు . 
 
ఓవరాల్ గా : 
 
శర్వానంద్ హీరో దర్శకుడు మారుతి కాంబినేషన్ అనగానే ఎంటర్ టైన్ మెంట్ ని కోరుకోవడం సహజం పైగా ఈ కాంబినేషన్ కు యువి క్రియేషన్స్ కూడా తోడవడంతో మరింతగా అంచనాలు పెరుగుతాయి . అయితే ఆ అంచనాలను అందుకోవడంలో మహానుభావుడు  సక్సెస్ అయ్యాడు . ఈ దసరా మహానుభావుడి దే అనడంలో సందేహం లేదు .


Comments

LATEST GALLERY


Hey Pillagada Movie Posters


Lakshmi Manchu Latest Gallery


Naga Chaitanya Savyasachi Frist Look


Nivetha Pethuraj New Photos


Napolean Movie Press Meet


80's South Actors Re-Union Party Pics


Mental Madilo Audio Pre -Release


Napoleon Movie Posters


Nagarjuna RGV New Movie Gallery


Mehreen Pirzada New Photos


RGV Nagarjuna Movie Opening


Jawaan Movie Pre Release Launch


Jawaan Audio And Pre Release Event Posters


Gopichand's 25th Film Opening Photos


Vishaka New Gallery

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD