మేడ మీద అబ్బాయి రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

మేడ మీద అబ్బాయి రివ్యూ

Murali R | Published:September 8, 2017, 12:00 AM IST

నటీనటులు    : అల్లరి నరేష్ , నిఖిల విమల్ , జబర్దస్త్ ఆది 
సంగీతం        : షాన్ రెహమాన్ 
నిర్మాత          : బొప్పన చంద్రశేఖర్ 
దర్శకత్వం    : జి . ప్రజీత్ 
రేటింగ్          : 2. 5/ 5
రిలీజ్ డేట్    : 8 సెప్టెంబర్ 2017


 

Editor Review
అల్లరి నరేష్ గతకొంత అయిదేళ్లుగా హిట్ కోసం తపించి పోతున్నాడు . వరుస పరాజయాలను అందుకుంటూ సతమతం అవుతున్న అల్లరి నరేష్ కు ఈ మేడ మీద అబ్బాయి అయినా హిట్ ని అందించాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
సినిమా రంగంలో తన ప్రతిభా పాటవాలను చూపించాలనే కోరికతో హైదరాబాద్ కు బయలుదేరుతాడు శ్రీను ( అల్లరి నరేష్ ) . అయితే ట్రైన్ ప్రయాణం లో అనుకోకుండా సింధు ( నిఖిల విమల్ ) తో సెల్ఫీ తీసుకుంటాడు శ్రీను , అయితే ముచ్చటపడి తీసుకున్న సెల్ఫీ వల్ల చిక్కుల్లో పడతాడు . సెల్ఫీ తీసుకోవడం వల్ల శ్రీను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ? అసలు సింధు ఎవరు ? హైదరాబాద్ కు ఎందుకు వచ్చాడు ? సినిమారంగంలో తను అనుకున్నది సాధించాడా ? ఇత్యాది విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
అల్లరి నరేష్ 
కామెడీ 
జబర్దస్త్ ఆది 
 
డ్రా బ్యాక్స్ : 
 
కథ 
సెకండాఫ్ 
 
నటీనటుల ప్రతిభ : 
 
అల్లరి నరేష్ కు ఇటువంటి పాత్రలు కొట్టిన పిండే ! దాంతో బాగా నటించి ప్రేక్షకులను నవ్వించాడు . ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే స్పూఫ్ లు లేకపోవడం పెద్ద రిలీఫ్ ఎందుకంటే గతకొంత కాలంగా అల్లరి నరేష్ చేస్తున్న పాత్రలు అవే  మరి . ఇక జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయిన హైపర్ ఆది కామెడీ టైమింగ్ బాగుంది . అల్లరి నరేష్ - ఆది ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించాయి . హీరోయిన్ నిఖిల విమల ఫరవాలేదనిపించింది . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
మలయాళంలో మంచి హిట్ అయిన '' ఒరు వడక్కన్ సెల్ఫీ '' చిత్రాన్ని తెలుగులో మేడ మీద అబ్బాయి గా రీమేక్ చేసాడు దర్శకులు జి . ప్రజీత్ . అయితే ఫస్టాఫ్ ని బాగానే నవ్వులతో లాక్కొచ్చినప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి తేలిపోయాడు . కథ మామూలుదే అయినప్పటికీ కథనం అయినా సరిగా రాసుకోవాల్సి ఉండే పైగా ఇది రీమేక్ కాబట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు కానీ ఆ పని సవ్యంగా చేయలేకపోయాడు ప్రజీత్ . షాన్ రెహమాన్ సంగీతం యావరేజ్ గానే ఉంది బొప్పన చంద్రశేఖర్ నిర్మాణ విలువలు ఫరవాలేదు . 
 
ఓవరాల్ గా : 
 
అల్లరి నరేష్ , ఆది ల కామెడీ తో ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి నీరసమైన కథనం తో ప్రేక్షకులు అసహనానికి గురవడం ఖాయం . ఓసారి అలా నవ్వుకుందాం కొంచెం ఇబ్బంది అయినా ఫరవాలేదు అనే వాళ్లకు ఈ సినిమా నచ్చొచ్చు . అయితే అల్లరి నరేష్ మాత్రం ప్లాప్ ల జాబితా నుండి ఇంకా బయట పడలేక పోయాడు ఈ సినిమా తో కూడా . 


Comments

LATEST GALLERY


80's South Actors Re-Union Party Pics


Mental Madilo Audio Pre -Release


Napoleon Movie Posters


Nagarjuna RGV New Movie Gallery


Mehreen Pirzada New Photos


RGV Nagarjuna Movie Opening


Jawaan Movie Pre Release Launch


Jawaan Audio And Pre Release Event Posters


Gopichand's 25th Film Opening Photos


Vishaka New Gallery


Shravya Rao Latest Stills


Vana Villu Movie Audio Launch


Chalo Movie Teaser Launch


Rashmika Mandanna New Photos


Nayantara Jai Simha Movie Posters

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD