మిక్చర్ పొట్లం రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

మిక్చర్ పొట్లం రివ్యూ

Murali R | Published:May 20, 2017, 12:00 AM IST

నటీనటులు : శ్వేతా బసు ప్రసాద్ , జయంత్ , భానుచందర్ తదితరులు 
సంగీతం : మాధవపెద్ది సురేష్ 
నిర్మాతలు : వీరన్న చౌదరి , లంకలపల్లి శ్రీనివాసరావు , లక్ష్మీ ప్రసాద్ 
దర్శకత్వం : ఎం వి సతీష్ కుమార్ 
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 19 మే 2017


 

Editor Review
శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్రలో భానుచందర్ , సుమన్ , జయంత్ , గీతాంజలి , కృష్ణభగవాన్ , అలీ , పోసాని తదితరులు నటించిన చిత్రం మిక్చర్ పొట్లం . ఎంవి సతీష్ కుమార్ దర్శకత్వంలో గోదావరి సినీ టోన్ పతాకంపై లక్ష్మి ప్రసాద్ , వీరన్న చౌదరి , శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించినఈ  చిత్రం మే 19న రిలీజ్ అయ్యింది . కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ మిక్చర్ పొట్లం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే . 
 
కథ
 
సువర్ణ సుందరి ( శ్వేతాబసు ప్రసాద్ ) ట్రావెల్స్ యజమాని . కసక్కు లాంటి సువర్ణ సుందరి బస్సు కు చాలా డిమాండ్ ఉంటుంది . ఆమె  బస్సు ఎక్కాలని తహతహలాడుతుంటారు జనాలు  . అమలాపురం నుండి షిర్డీ కి సువర్ణసుందరి బస్సు బయలుదేరుతుంది . అయితే మార్గ మద్యంలోనే సువర్ణ సుందరి బస్సులో ఉన్నవాళ్ళ ని నక్సలైట్లు కిడ్నాప్ చేస్తారు . సువర్ణ సుందరి బస్సు నే నక్సలైట్లు ఎందుకు కిడ్నాప్ చేసారు ? నక్సలైట్లు ప్రభుత్వానికి ఎటువంటిడిమాండ్లు పెట్టారు ? చివరకు బందీలు విడుదల అయ్యారా ? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్
 
శ్వేతాబసు ప్రసాద్ 
భానుచందర్ 
పోసాని 
3 పాటలు 
 
డ్రా బ్యాక్స్
 
నిడివి ఎక్కువ ఉండటం 
 
నటీనటుల ప్రతిభ
 
సువర్ణ సుందరి గా శ్వేతాబసు ప్రసాద్ మెప్పించింది .రీ ఎంట్రీలో  అభినయం కంటే గ్లామర్ తో మరింతగా  ఆకట్టుకుంది . నక్సలైట్ నాయకుడి గా భానుచందర్ నటన బాగుంది . హోం మినిష్టర్ గా విలనిజాన్ని పండించడమే కాకుండా నవ్వించాడు పోసాని . అలాగే మిగిలిన పాత్రల్లో జయంత్ , గీతాంజలి జంట బాగుంది . కృష్ణభగవాన్ , అలీ , జూనియర్ రేలంగి , కంటే వీరన్న చౌదరి హాస్యంతో అలరించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
ఫస్టాఫ్ ని కామెడీ జోనర్ లో నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయేలా ఇచ్చాడు . కామెడీ తో రన్ అవుతున్న సినిమా ఒక్కసారిగా నక్షలైట్ల ఎంట్రీ తో మరో మలుపు తిరిగి సెకండాఫ్ ఎలా ఉండబోతోందో అన్న టెన్షన్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు సతీష్ కుమార్ . కృష్ణభగవాన్ , అలీ , కంటే వీరన్న చౌదరి ల మధ్య ఫన్ జనరేట్ అయ్యేలా చేసాడు . అలాగే శ్వేతాబసు నుండి ఏం కోరుకుంటారో అది అందించి కుర్రాళ్లకు గాలం వేసాడు . కిడ్నాప్ నేపథ్యంలో సెకండాఫ్ బాగానే రక్తికట్టింది అయితే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే మరింతగా స్క్రీన్ ప్లే ని  బెటర్ మెంట్ చేసి ఉంటే పెద్ద హిట్ అయ్యేది ఈ మిక్చర్ పొట్లం . నటీనటుల నుండి , సాంకేతిక నిపుణుల నుండి తనకు రావాల్సిన దాన్ని రాబట్టుకున్నాడు దర్శకులు  సతీష్ కుమార్ . చాలాకాలం తర్వాత మాధవపెద్ది సురేష్ సంగీతం అందించిన సినిమా ఇది . మూడు పాటలు బాగున్నాయి . ఇక ఛాయాగ్రాహకులు కళ్యాణ్ సమీ అందించిన సినిమాటో గ్రఫీ చాలా బాగుంది . అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి . 
 
ఓవరాల్ గా
 
శ్వేతాబసు ప్రసాద్ గ్లామర్ , కృష్ణభగవాన్ , పోసాని , అలీ , కంటే వీరన్న చౌదరి ల కామెడీ , భానుచందర్ నక్సలిజం వెరసి మిక్చర్ పొట్లం ఈ వారం మంచి రిలీఫ్ ఇచ్చే సినిమా అని చెప్పొచ్చు . 


Comments

LATEST GALLERY


Ammayilante Adho Typu Movie Posters


PelliRoju Movie Audio Release


Miya George New Stills


Jai Lava Kusa Movie Jayotsavam


Sathya Dev New Photos


Mahanubhavudu Movie 4 Days To Go Posters


Sushmitha Sen at Banjara Hills


Spyder Movie 2 Days To Go Posters


Neha Deshpande New Photos


Vaadena Movie Teaser Launch


Mahanubhavudu Movie Pre Release Function


Tamannaah Latest Stills


Rachana Choudary Marriage Photos


Jai Lava Kusa New Movie Walls


Catherine & Vijay launch KLM Fashion Mall at Kukatpally

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD