Home రివ్యూస్ నీలి మలై రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

నీలి మలై రివ్యూ



Friday May 26th 2017

నటీనటులు     : పల్లెర్ల ఆనంద్ కృష్ణ , వృషాలి గోస్వామి , భానుచందర్ 
సంగీతం         : సదివే దేవేంద్ర , నీరు 
నిర్మాత           : పల్లెర్ల ఆనంద్ 
దర్శకత్వం     : సూర్య కిరణ్ ఇలాడి 
రేటింగ్           : 2.75/ 5
రిలీజ్ డేట్     : 26 మే 2017


 

Editor Review
అయ్యప్ప స్వామి కథ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి , కాగా అదే కోవలో వచ్చిన మరో భక్తిరస కథా చిత్రమే ఈ '' నీలి మలై '' . కాకపోతే భక్తికథ కు కాస్త యాక్షన్ ని కూడా జోడించి చేసిన ప్రయత్నమే ఈ నీలి మలై . మరి ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
అయ్యప్ప అనుగ్రహంతో జన్మించిన బిడ్డ కాబట్టి ఆ స్వామి కి గుర్తుగా మణికంఠ ( పల్లెర్ల ఆనంద్ ) అని పేరు పెడతారు అతడి తల్లిదండ్రులు ( భానుచందర్ - ప్రభావతి ).  కావ్య ( వృషాలి గోస్వామి ) మణికంఠ క్లాస్ మేట్ , మణికంఠ అంటే ప్రాణం కావ్య కు . అయితే కాస్త దూకుడు మనస్తత్వం ఉన్న మణికంఠ గొడవలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులు కోరతారు కానీ తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా గొడవలకు దిగుతాడు దాంతో అతడికి బుద్ది చెప్పాలని భావించి అయ్యప్ప మాల వేయిస్తారు మణికంఠ చేత . స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్తున్న సమయంలో ఓ చిన్నారిని కాపాడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది మణికంఠ కు . మరి ఆ చిన్నారి ని మణికంఠ కాపాడాడా ? అసలు ఆ చిన్నారి ఎవరు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
పల్లెర్ల ఆనంద్ 
అయ్యప్ప పాటలు 
 
డ్రా బ్యాక్స్ : 
స్క్రీన్ ప్లే 
 
నటీనటుల ప్రతిభ : 
 
పల్లెర్ల ఆనంద్ మొదటి సినిమాతోనే తనని తానూ ప్రూవ్ చేసుకున్నాడు . డ్యాన్స్ లోను , నటన లోను , యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా సత్తా చాటాడు . మొదటి సినిమాలోనే అన్ని అంశాలు ఉండేలా మెప్పించాడు . హీరోయిన్ వృషాలి గోస్వామి కూడా మంచి నటననే ప్రదర్శించింది . అలాగే ఇతర పాత్రల్లో భానుచందర్ , చంద్రశేఖర్ , ప్రభావతి , చిన్నారి నీలిమ , అలీ , పొట్టి రాంబాబు తమతమ పాత్రలతో మెప్పించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
సాంకేతిక విభాగాల్లో ఛాయాగ్రహణం , సంగీతం బాగా కుదిరాయి , భక్తిరస పాటలు ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తడం ఖాయం .   నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు సూర్యకిరణ్ ఇలాడి విషయానికి వస్తే ...... మొదటి ప్రయత్నం లోనే మంచి అటెంప్ట్ చేసాడు . భక్తి కి యాక్షన్ ని జోడించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు అయితే మరింత గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే ఖచ్చితంగా తనదైన ముద్ర వేసేవాడు . నటీనటుల నుండి తనకు రావాల్సిన నటనని రాబట్టుకున్నాడు సూర్యకిరణ్ . 
 
ఓవరాల్ గా : 
 
ఓ మంచి ప్రయత్నం ఈ ....... నీలి మలై
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD