Home రివ్యూస్ ఓ పిల్లా నీ వల్లా రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

ఓ పిల్లా నీ వల్లా రివ్యూ



Saturday May 27th 2017

నటీనటులు    : కృష్ణచైతన్య , రాజేష్ రాధోడ్ ,షాలు , మౌనిక 
సంగీతం        : మధు 
నిర్మాత        : కిషోర్ 
దర్శకత్వం     : కిషోర్ 
రేటింగ్         : 2.75 / 5 
రిలీజ్ డేట్     : 26 మే 2017


 

Editor Review
రెండు ప్రేమ జంటల నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రమే ఈ '' ఓ పిల్లా నీ వల్లా '' . కిషోర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యుత్ ని టార్గెట్ చేసింది . మరి ఈ సినిమా యుత్ ని ఆకట్టుకునేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్ళాల్సిందే . 
 
కథ : 
రాజేష్ అనే యువకుడు తన ఫ్రెండ్ అయిన అవంతిక ( మౌనిక ) ని ప్రేమిస్తాడు ,అలాగే అవంతిక కూడా రాజేష్ ని ప్రేమిస్తుంది అయితే ఈ విషయం ఎవరు కూడా చెప్పుకోరు . అదే సమయంలో కృష్ణ చైతన్య అనే యువకుడు నేహా ( షాలు ) ని ఇష్టపడతాడు . అయితే చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల రాజేష్ - కృష్ణ చైతన్య లకు గొడవ అవుతుంది . అది రాజేష్ - అవంతిక ల పాలిట మరిన్ని మనస్పర్ధలు వచ్చేలా చేస్తుంది . దాంతో దూరం అవుతారు , అయితే రాజేష్ కు అవంతిక కు మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి ? చివరకు ఆ ఇద్దరు కలిసారా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
కథ 
కామెడి 
నటీనటుల ప్రతిభ 
పాటలు 
 
డ్రా బ్యాక్స్ : 
స్క్రీన్ ప్లే 
 
నటీనటుల ప్రతిభ : 
 
కృష్ణచైతన్య , రాజేష్ రాధోడ్ ,షాలు , మౌనిక లు తమ తమ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు . కొత్తవాళ్ళు అయినప్పటికీ నటనలో మాత్రం మెరుగ్గానే రాణించారు . మరింత బ్రైట్ ఫ్యూచర్ కోసం మ=ఇంకాస్త కష్టపడాలి . అయితే తొలి ప్రయత్నం లోనే మంచి అటెంప్ట్ చేసి మెప్పించారు .
 
సాంకేతిక వర్గం : 
 
పరిమిత బడ్జెట్ లో తీసినప్పటికీ ఛాయాగ్రహణం సినిమాకు ప్లస్ అయ్యింది . చక్కటి విజువల్స్ సినిమాని మరింత రంజింప జేసేలా చేసింది . అలాగే మధు అందించిన పాటలు బాగున్నాయి , ఇక దర్శక నిర్మాత కిషోర్ దగ్గరకు వస్తే రెండు బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తించాడు . మంచి కాన్సెప్ట్ ని ఎంచుకొని మంచి ప్రయత్నమే చేసాడు . అయితే స్క్రీన్ ప్లే పరంగా మరింత జాగ్రత్త పడి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ రేంజ్ కి వెళ్లి ఉండేది . 
 
ఓవరాల్ గా : 
 
యుత్ ని ఆకట్టుకునే అన్ని అంశాలతో వచ్చిన ఓ పిల్లా నీ వల్లా కుర్రకారు కి బాగా నచ్చడం ఖాయం .
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD