పైసా వసూల్ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

పైసా వసూల్ రివ్యూ

Murali R | Published:September 1, 2017, 12:00 AM IST

నటీనటులు : నందమూరి బాలకృష్ణ , శ్రియా శరన్ , ముస్కాన్ ,విక్రం జీత్ 
సంగీతం     : అనూప్ రూబెన్స్ 
నిర్మాత       : వి . ఆనంద్ ప్రసాద్ 
దర్శకత్వం  : పూరి జగన్నాధ్ 
రేటింగ్        : 2  / 5 
రిలీజ్ డేట్  : 1 సెప్టెంబర్ 2017


 

Editor Review
నటసింహం నందమూరి బాలకృష్ణ 101వ చిత్రంగా వచ్చిన చిత్రం పైసా వసూల్ . వరుసగా భారీ ఫ్లాప్ చిత్రాలను అందిస్తున్న దర్శకులు పూరి జగన్నాధ్ కు నందమూరి బాలకృష్ణ చాన్స్ ఇవ్వడం తో అందరూ ఆశ్చర్యపోయారు . స్టంపర్ రిలీజ్ వరకు ఈ సినిమా మీద పెద్దగా అంచనాలే లేవు కానీ స్టంపర్ తర్వాత ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి . మరి ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఈరోజు రిలీజ్ అయిన పైసా వసూల్ ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్ళాల్సిందే . 
 
కథ : 
 
తేడా సింగ్ ( నందమూరి బాలకృష్ణ ) పెద్ద తేడా అని తెలుసుకొని అతడ్ని ఉపయోగించుకొని అండర్ వరల్డ్ డాన్ అయిన పోర్చుగల్ డాన్  బాబ్ మార్ లే ( విక్రం జీత్ ) ని అంతం చేయాలనీ ప్లాన్ చేస్తారు పోలీసులు . అయితే అసలే తేడా సింగ్ కావడంతో పోలీసులు నన్ను పిలిచి పోర్చుగల్ లో ఉన్న మీ బాస్ ని చంపమని నన్ను అడిగారని నేరుగా హైదరాబాద్ లో ఉన్న బాబ్ మార్లే అనుచరులకే చెబుతాడు తేడా సింగ్ . అయితే అదే సమయంలో మంత్రి అనుచరులు శ్రియా కోసం ఆమె పంపించిన ఆధారాలతో కోసం వాళ్ళ ఇంటిపై దాడి చేస్తారు . తేడా సింగ్ మకరం ( ముస్కాన్ ) ని ప్రేమించాడు కాబట్టి మకరం ని తీసుకువస్తే తేడా సింగ్ వస్తాడని భావించి ఆమెని కిడ్నాప్ చేస్తారు . తన ప్రేయసిని కిడ్నాప్ చేయడంతో బాబ్ మార్లే అనుచరులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు , అయితే అనూహ్యంగా తేడా సింగ్ ని తన ప్రేయసే కాల్చివేస్తుంది . అసలు ఈ తేడా సింగ్ ఎవరు ? పోర్చుగల్ కి ఇతడికి సంబంధం ఏంటి ? హైదరాబాద్ ఎందుకు వచ్చాడు ? చివరకు దుష్ట శిక్షణ జరిగిందా ? తేడా సింగ్ ని అతడి ప్రేయసి ఎందుకు కాల్చింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
నందమూరి బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ 
 
రెండు పాటలు 
 
డ్రా బ్యాక్స్ : 
 
కథ 
కథనం 
హీరోయిన్ లు 
డైరెక్షన్ 
 
నటీనటుల ప్రతిభ : 
 
నటసింహం నందమూరి బాలకృష్ణ తేడా సింగ్ గా అద్భుతంగా నటించాడు . పూర్తిగా పూరి జగన్నాధ్ కోసం తన క్యారెక్టర్ ని         మార్చేసుకున్నాడు , కేవలం సినిమా అంతటిని తన భుజస్కంధాలపై మోసాడు . బాలయ్య నటనలో వేలెత్తి చూపడానికి ఏం లేదు కానీ గొంతు కొంత బొంగురు పోవడం ఒకటే మైనస్ . బాలయ్య చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ ని విశేషంగా అలరించడం ఖాయం . ఇక బాలయ్య జోష్ చూస్తుంటే 50 ప్లస్ లోనూ అదరగోట్టడం బాలయ్య కే చెల్లింది, అంతేనా బాలయ్య ఈ సినిమాలో ఓ పాట పాడటం విశేషం ఇక ఆ పాటకి నందమూరి అభిమానుల ఈలలే ఈలలు గోలలే గోలలు థియేటర్ అంతటా  . ఇక శ్రియా శరన్ విషయానికి వస్తే ఉన్నది కొంతసేపు అయినప్పటికీ గుర్తుండి పోయే పాత్రే లభించింది . ఇక విలన్ గా నటించిన విక్రం జీత్ చూడటానికి బాగానే ఉన్నాడు కానీ తమ్ముడు కోరిన అమ్మాయిలను సప్లయ్ చేసే బ్రోకర్ లా కనిపించాడు తప్పితే పోర్చుగల్ మాఫియా డాన్ లా ఎక్కడా అనిపించలేదు . అలాగే మిగిలిన హీరోయిన్ లలో ముస్కాన్ సేతి , కైరా దత్ లు అంతగా కట్టుకునేలా లేరు . ముస్కాన్ అయితే పేరుకి హీరోయిన్ కానీ ఆ ఫీచర్స్ ఎక్కడా లేవు మరి . 
 
సాంకేతిక వర్గం : 
 
ముఖేష్ సినిమాటోగ్రఫీ బాగుంది , పోర్చుగల్ అందాలను అలాగే నిర్మాత పెట్టిన ఖర్చు ని తెరమీద చూపించి సక్సెస్ అయ్యాడు . అలాగే బాలయ్య ని కూడా కొత్తగా చూపించాడు . అనూప్ రూబెన్స్ విషయానికి వస్తే ........ రెండు పాటలు మంచి హిట్స్ ఇచ్చాడు , బయట వినడం కంటే స్క్రీన్ పై మరింతగా బాగున్నాయి దాంతో ఆ పాటలకు థియేటర్ లో మంచి ఊపోస్తోంది . ముఖ్యం గా బాలయ్య పాడిన అరె ! మామా ఎక్ పెగ్ లా ..... పాట కి బాలయ్య ఫ్యాన్స్ ఊగిపోతున్నారు . నిర్మాణ విలువలు బాగున్నాయి . 
ఇక దర్శకులు పూరి జగన్నాధ్ విషయానికి వస్తే ........ కథ , కథనం , మాటలు , దర్శకత్వం ఇలా అన్ని ముఖ్య శాఖలను నిర్వహించిన పూరి ఏ ఒక్క దాంట్లో కూడా రాణించలేక పోయాడు అంతేకాదు డిజాస్టర్ లకే డిజాస్టర్ ని ఇచ్చి బాలయ్య అభిమానులకు నరకం చూపించాడు . వరుసగా పరాజయాలను చవి చూస్తున్నప్పటికి పూరి లో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదు . బాలయ్య లాంటి అగ్ర హీరో చాన్స్ ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని అటు బాలయ్య కు ఇటు తనకు మంచి పేరు వచ్చేలా సినిమా తీయాలి కానీ ఇంకా అదే పాత ఫార్ములా మాఫియా కథ ని ఎంచుకొని అడ్డదిడ్డమైన స్క్రీన్ ప్లే తో ఓ ఆట ఆడుకున్నాడు . పూరి ఇప్పుడు ఓ మాయలో ఉన్నాడు ఆ మాయ లోంచి బయట పడితే తప్ప అతడు మళ్ళీ డైరెక్షన్ కి పనికి రాడు . హీరో పేరు తేడ సింగ్ అని పెట్టి తేడా సినిమాకు భారీగా ఖర్చు పెట్టించి తేడా తేడా గా వదిలాడు . రెండున్నర గంటల సినిమాలో ఒక్కటంటే ఒక్క సీన్ లో కూడా తన దర్శకత్వ ప్రతిభ చూపించలేక పోయాడంటే ఇక అక్కడే తేలిపోయింది పూరి జగన్నాధ్ పని అయిపోయిందని . 
 
ఓవరాల్ గా : 
 
ఈ సినిమాని బాలయ్య అభిమానులు కూడా భరించడం కష్టం ఎందుకంటే ........ వీడు తేడా ...... దిమాక్ తోడా ...... చాలా తేడా సింగ్ కాబట్టి . 


Comments

LATEST GALLERY


Bhaagamathie Movie Pre Release Event Photos


Manasuki Nachindi Movie Stills


Pawan Kalyan Family at St Mary's Stills


Tholi Prema Movie Audio Launch


Raashi Khanna New Photos


Pragya Jaiswal Latest Stills


Tholi Prema Movie Stills


Achari America Yatra Pre Release Function


Naresh Birthday Celebrations Stills


Director Maruthi Naga Chaitanya Movie Opening Stills


Howrah Bridge Movie Stills


Achari America Yatra Poster and Still


Tik Tik Tik Movie Trailer Launch by Sai Dharam Tej


Touch Chesi Choodu Movie Stills


NTR's Death Anniversary Day 2018 at NTR Ghat

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD