పటేల్ సర్ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

పటేల్ సర్ రివ్యూ

Murali R | Published:July 14, 2017, 12:00 AM IST

నటీనటులు : జగపతిబాబు , పద్మప్రియ , తాన్యా హాప్ 
సంగీతం : డీజే వసంత్ 
నిర్మాత : సాయి కొర్రపాటి 
దర్శకత్వం : వాసు పరిమి 
రేటింగ్ : 2 / 5
రిలీజ్ డేట్ : 14 జూలై 2017


 

Editor Review
చాలాకాలం తర్వాత జగపతిబాబు హీరోగా నటించిన చిత్రం '' పటేల్ సర్ '' . వాసు పరిమి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
రిటైర్డ్ ఆర్మీ మేజర్ అయిన పటేల్ ( జగపతిబాబు ) దేవరాజ్ ( కబీర్ సింగ్ ) గ్యాంగ్ వాళ్ళని ఒక్కొక్కరిగా చంపుతుంటాడు . తన మనుషులను చంపుతున్నది ఎవరో తెలుసుకోవడానికి మంత్రి సహకారంతో ఓ దర్యాప్తు అధికారిని కేథరిన్ ( తాన్యా హాప్ ) ఏర్పాటయ్యేలా చేస్తాడు దేవరాజ్ . పటేల్ దేవరాజ్ గ్యాంగ్ ని ఎందుకు టార్గెట్ చేస్తాడు ? కేథరిన్ పటేల్ ని పట్టుకుందా ? చివరకు ఏమైంది అన్న విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
జగపతిబాబు 
ఇంటర్వెల్ బ్లాక్ 
క్లైమాక్స్ 
 
డ్రా బ్యాక్స్ : 
 
స్క్రీన్ ప్లే 
నిర్మాణ విలువలు 
 
నటీనటుల ప్రతిభ : 
 
పటేల్ సర్ గా జగపతిబాబు గెటప్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది , పైగా సినిమాని తన భుజ స్కంధాలపై మోశాడు కూడా . చాలారోజుల తర్వాత హీరోగా నటించి మెప్పించాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆమనీ , పద్మప్రియ , తాన్యా హాప్ , కబీర్ సింగ్ , పోసాని , సుబ్బరాజు తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు . 
 
సాంకేతిక వర్గం : 
 
డీజే వసంత్ సంగీతం ఫరవాలేదు , శ్యామ్ కె నాయుడు ఫోటోగ్రఫీ బాగుంది , సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు అంతగా బాగోలేవు . ఇక దర్శకుడు వాసు పరిమి విషయానికి వస్తే పేలవమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు నీరసం వచ్చేలా  చేసాడు . అయితే కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి . సెకండాఫ్ ని కొద్దిగా బెటర్ గా తీర్చి దిద్దాడు . 
 
ఓవరాల్ గా : 
 
పటేల్ సర్ లుక్స్ ఓకే ..... కానీ సినిమా వేస్టే 


Comments

LATEST GALLERY


Manjusha Latest Stills


Nani Mca Movie First Look


Priyanka Latest Stills


Sakshyam Movie Motion Poster Launch


Pooja Hegde New Photos


Garuda Vega Movie Trailer Launch


Mahanati Movie Posters


Mehreen Kaur Latest Stills


Keerthi Suresh Birthday Photos


Krishna Rao Supermarket Movie Opening


Elsa Ghosh New Photos


Raju Gari Gadhi 2 Movie Success Meet


Seerat Kapoor Latest Stills


Samantha New Stills


Raja The Great Movie New Walls

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD