ప్రేమ‌లీల పెళ్లి గోల రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

ప్రేమ‌లీల పెళ్లి గోల రివ్యూ

Murali R | Published:July 4, 2017, 12:00 AM IST

న‌టీన‌టులు:   విష్ణు విశాల్, నిక్కీ గ‌ల్రానీ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం : ఎళిల్ 
నిర్మాత :పారస్ జైన్
 రేటింగ్ 3/5


 

Editor Review
తమిళనాట విజయం సాధించిన '' వెళ్ళైకారన్ '' చిత్రాన్ని తెలుగులో '' ప్రేమ లీల - పెళ్లి గోల '' గా తెలుగులో రిలీజ్ చేసారు మహావీర్ ఫిలిమ్స్ అధినేత పారస్ జైన్ . ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించడమే కాకుండా , పంపిణీదారుడుగా సంచలన విజయాలను అందుకున్న పారస్ జైన్ మరి ఈ సినిమాతో విజయం అందుకున్నాడా ? లేదా చూద్దాం . 
 
కథ : 
 
ఎం ఎల్ ఏ ఆధ్వర్యంలో 25 జంటలకు ఒకేసారి పెళ్లి చేయాలనీ నిర్ణయించుకుంటారు ఎం ఎల్ ఏ సన్నిహితుడు మురళి (విష్ణు విశాల్ ). అయితే తీరా పెళ్లి సమయానికి కొంతమంది పెళ్లికొడుకులు , ఒక పెళ్లి కూతురు పారిపోతుంది . దాంతో ఊళ్ళో ఉన్న యువకులను కిడ్నాప్ చేస్తాడు మురళి అయితే ఒక పెళ్లి కొడుకు తక్కువ పడటంతో తన మిత్రుడైన కరక్కాయ్ ( సూరి ) ని కూడా తీసుకెళ్లి మోసపూరితంగా పుష్ప అనే యువతి తో పెళ్లి చేయిస్తాడు . అదే సమయంలో ఎస్సై కావాలనుకునే అర్చన ( నిక్కీ గల్రాని ) ని చూసి లవ్ లో పడతాడు మురళి . పుష్ప అనే యువతి పెద్ద కేసు అని తెలియడంతో ఆమె నుండి విడాకులు తీసుకోవడానికి కరక్కాయ్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు . చివరకు ఏమైంది అన్న విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
ఎంటర్ టైన్మెంట్ 
సూరి పాత్ర 
సెకండాఫ్ 
 
డ్రా బ్యాక్స్ : 
 
ఫస్టాఫ్ కొంత భాగం 
 
నటీనటుల ప్రతిభ : 
 
 విష్ణు విశాల్ హీరోగా మెప్పించాడు , మంచి నటన ని కనబరిచాడు . ఇక ఈ సినిమాకు హైలెట్ అంటే కమెడియన్  సూరి . పుష్ప భర్త గా నవ్వులు పూయించారు , అంతేకాదు పుష్ప నుండి విడాకుల కోసం పరితపించే కరక్కాయ్ పాత్రలో సినిమా అంతా వినోదాన్ని పంచాడు .అలాగే హీరోయిన్ నిక్కీ గల్రాని పాత్ర ఫరవాలేదు . ఇక మరో విశేషం ఏంటంటే ఎం ఎల్ ఏ పాత్రతో పాటు విలన్ పాత్రలతో కూడా నవ్వుల పువ్వులు పూయించాడు దర్శకుడు . 
 
సాంకేతిక వర్గం : 
 
చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి , దర్శకులు విషయానికి వస్తే సినిమాని ఆధ్యంతం మంచి ఎంటర్ టైనర్ లా తీర్చి దిద్దాడు , అయితే ఫస్టాఫ్ లో కొంతభాగం ఎడిట్ చేస్తే మరింత బాగుండేది . కెమెరా వర్క్ కూడా బాగుంది . మొత్తానికి ఈ సినిమాకు అన్నీ కుదిరాయి . 
 
ఓవరాల్ గా : 
 
చక్కటి వినోదాన్ని కోరుకునే వాళ్లకు ప్రేమ లీల పెళ్లి గోల కేరాఫ్ అడ్రస్ . 

Comments

LATEST GALLERY


Japanese Film Festival Launch


Mahanubhavudu Movie New Posters


Oxygen Movie New Stills


Nandini New Photos


Amrutha New Photos


Madhumitha Krishna New Gallery


Anu Emmanuel Latest Stills


Rana,Vijay,Anu Emmanuel KLM Shopping Mall at Ameerpet


Srivalli Movie Press Meet


Raju Gari Gadhi 2 Trailer Launch


Seerat Kapoor New Photos


Project C 420 Movie Opening Photos


Tanya Hope Photoshoot Photos


Mahanubhavudu Movie Trailer Launch


Mehreen Pirzada New Stills

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD