Home రివ్యూస్ రాధ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

రాధ రివ్యూFriday May 12th 2017

నటీనటులు   : శర్వానంద్ , లావణ్య త్రిపాఠి , రవికిషన్ తదితరులు
సంగీతం       : రాధన్
నిర్మాత       : భోగవల్లి బాపినీడు
దర్శకత్వం    : చంద్రమోహన్
రేటింగ్        : 3/ 5
రిలీజ్ డేట్    : 12 మే 2017


 

Editor Review
వరుస విజయాలను సాధిస్తున్న శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం '' రాధ ''. కొత్త దర్శకుడు చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
చిన్నప్పటి నుండి భగవద్గీత వింటూ పెద్దయ్యాక పోలీస్ అవ్వాలని కళలు కంటాడు  రాధాకృష్ణ ( శర్వానంద్ ). పోలీస్ కాకముందే నేరస్థులను పట్టుకొని డిజిపి మెప్పు పొందడమే కాకుండా ఎస్సై గా సెలెక్ట్ అవుతాడు . ఎస్సై అయ్యాక అల్లర్లు లేని ఏరియాకి వెళ్తాడు రాధాకృష్ణ అయితే  నాకు ఇటువంటి పీస్ ఫుల్ ఏరియాలో పోస్టింగ్ వద్దని ధూల్ పేట కు ట్రాన్స్ ఫర్ చేయించుకుంటాడు . సరిగ్గా అదే సమయంలో సిట్టింగ్ సీఎం ( కోట శ్రీనివాసరావు ) వృద్ధుడు అయినందున రాబోయే ఎన్నికలలో పీపుల్స్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సుజాత ( రవికిషన్ ) సూర్రెడ్డి ( ఆశిష్ విద్యార్థి ) లలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలనుకుంటారు అధిష్టానం . సుజాత పాల్గొన్న ఓ మీటింగ్ లో బాంబ్ దాడి జరుగుతుంది , ఆ దాడిలో పోలీసులతో పాటు ప్రజలు కూడా చనిపోతారు . దాంతో రాధాకృష్ణ ఎలా రియాక్ట్ అయ్యాడు . బాంబ్ పేల్చింది ఎవరు ? అసలు హంతకులను రాధాకృష్ణ పట్టుకున్నాడా  ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
శర్వానంద్ 
ఎంటర్ టైన్మెంట్ 
 
డ్రా బ్యాక్స్ : 
 
సెకండాఫ్ 
 
నటీనటుల ప్రతిభ : 
 
పోలీస్ ఆఫీసర్ పాత్రలో శర్వానంద్ మెప్పించాడు . ఎంటర్ టైన్మెంట్ ని జోడించి శర్వానంద్ మంచి నటన ని ప్రదర్శించాడు . సాధారణ కథ కి తన నటనతో మరో లెవల్ కి తీసుకెళ్లాడు . ఇక హీరోయిన్ పాత్ర లో లావణ్య త్రిపాఠి కి పెద్ద స్కోప్ ఉన్న పాత్ర లభించలేదు కానీ ఉన్నంతలో కొంత లవ్ సీన్స్ లో మాత్రం మెప్పించింది . ఇక మిగిలిన పాత్రల్లో విలన్ గా రవికిషన్ మెప్పించాడు . సప్తగిరి , షకలక శంకర్ లు కామెడీ తో అలరించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
చంద్రమోహన్ కథ , కథనం సాదా సీదా గానే ఉంది , దర్శకుడి గా మొదటి ప్రయత్నం లోనే సక్సెస్ అయినప్పటికీ అనుకున్న రేంజ్ లో మాత్రం సక్సెస్ అందుకోలేక పోయాడు . స్క్రీన్ ప్లే మరింత పకడ్బందీగా రాసుకొని ఉంటే ఖచ్చితంగా మంచి హిట్ అయ్యేది . నిర్మాణ విలువలు బాగున్నాయి , రాధన్ సంగీతం యావరేజ్ గానే ఉంది అయితే కొంతవరకు రీ రికార్డింగ్ తో ఆకట్టుకున్నాడు . సినిమాటోగ్రఫీ బాగుంది . 
 
ఓవరాల్ గా : 
 
లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ రాధ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకునేలా లేకపోయినా కమర్షియల్ ఎంటర్ టైనర్ లను కోరుకునే వాళ్లకు ఈ సినిమా నచ్చవచ్చు .
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD