రాజా ది గ్రేట్ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

రాజా ది గ్రేట్ రివ్యూ

Murali R | Published:October 18, 2017, 1:45 PM IST

రాజా ది గ్రేట్ రివ్యూ 
నటీనటులు : రవితేజ , మెహరీన్ కౌర్ , శ్రీనివాస్ రెడ్డి తదితరులు 
సంగీతం : సాయి కార్తీక్ 
నిర్మాత : దిల్ రాజు 
దర్శకత్వం : అనిల్ రావిపూడి 
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 18 అక్టోబర్ 2017


 

Editor Review
మాస్ మహారాజ్ రవితేజ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం '' రాజా ది గ్రేట్ '' . పటాస్ , సుప్రీమ్ వంటి హిట్స్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ఈ రాజా ది గ్రేట్ . దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంతో రవితేజ హిట్ అందుకున్నాడా ? అనిల్ రావిపూడి హ్యాట్రిక్ సాధించాడా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ప్రకాష్ ( ప్రకాష్ రాజ్ ) కు భువనగిరి కి ట్రాన్స్ఫర్ అవుతుంది , భువనగిరి లో పెద్ద క్రిమినల్ అయిన దేవరాజ్ ( వివన్ ) ని అడ్డుకునే క్రమంలో అతడి తమ్ముడిని చంపేస్తాడు ప్రకాష్ . దేవరాజ్ కు తమ్ముడు అంటే ప్రాణం దాంతో తన తమ్ముడ్ని చంపిన ప్రకాష్ ని అలాగే మిగతా పోలీస్ అధికారులను చంపేస్తాడు , అయితే అదే క్రమంలో ప్రకాష్ కూతురు లక్కీ ని కూడా చంపాలనుకుంటాడు కానీ లక్కీ దేవరాజ్ నుండి తప్పించుకుంటుంది . సరిగ్గా అదే సమయంలో పుట్టుకతోనే అంధుడైన రాజా ( రవితేజ ) కు లక్కీ ని కాపాడే బాధ్యత అప్పగిస్తారు . పుట్టుకతోనే గుడ్డివాడు అయిన రాజా లక్కీ ని ఎలా కాపాడాడు ? దేవరాజ్ భరతం పట్టాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
రవితేజ 
ఎంటర్ టైన్ మెంట్ 
రీ రికార్డింగ్ 
డైరెక్షన్ 
డ్రా బ్యాక్స్ : 
 
రొటీన్ కథ  
 
నటీనటుల ప్రతిభ : 
 
అంధుడి గా నటించినందుకు ముందుగా రవితేజ ని అభినందించాల్సిందే, నిజంగానే చూపులేని వ్యక్తి గా రవితేజ అద్భుతంగా ఆ పాత్రలో జీవించాడు  . దాదాపు రెండేళ్ల విరామం తర్వాత రవితేజ చేసిన ఈ చిత్రం మళ్ళీ రవితేజ జోష్ అంటే ఏంటో నిరూపించింది . అసలే రవితేజ అంటే మంచి కామెడీ టైమింగ్ , దానికి తోడు ఛాలెంజింగ్ క్యారెక్టర్ పడటంతో మరింత ఉత్సాహంతో అదరగొట్టాడు . యాక్షన్ లో కానీ ఎంటర్ టైన్ మెంట్ విషయంలో కానీ రవితేజ ఎనర్జీ బాగుంది . హీరోయిన్ మెహరీన్ కౌర్ అందంగా ఉంది , అలాగే మరింత అందంగా నటించింది . ఇక విలన్ గా నటించిన వివన్ బాగా నటించాడు , క్రూరత్వాన్ని ప్రదర్శించి మెప్పించాడు . హీరో స్నేహితుడి పాత్రలో శ్రీనివాస్ రెడ్డి అదుర్స్ అనిపించాడు . అలాగే సీనియర్ నటి రాధిక పాత్ర కూడా బాగా వచ్చింది . ఇక మిగిలిన పాత్రల్లో ప్రకాష్ రాజ్ , తనికెళ్ళ భరణి , సంపత్ లు తమతమ పాత్రలకు న్యాయం చేసారు . 
 
సాంకేతిక వర్గం : 
 
పటాస్ , సుప్రీమ్ చిత్రాలను ఎంటర్ టైన్ మెంట్ జోడించి హిట్స్ గా మలిచాడు , ఇక తాజాగా రాజా ది గ్రేట్ చిత్ర కథ రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఎంటర్ టైన్ మెంట్ ని జోడించి ఇక్కడా సక్సెస్ అయ్యాడు దర్శకుడు అనిల్ రావిపూడి . మాస్ సినిమా అంటే ఇలాగే ఉండాలని గిరి గీసుకున్న వాళ్లకు అంధుడి కథ ని కమర్షియల్ గా వర్కౌట్ అయ్యేలా చేసిన అనిల్ ని అభినందించవలసిందే . కథ గొప్పదేమీ కాదు కానీ ఓ ప్రయత్నం అయితే చేసాడు . ఫస్టాఫ్ ని హాస్యంతో లాగించిన అనిల్ సెకండాఫ్ కు వచ్చేసరికి కొద్దిగా పట్టు తప్పాడు కానీ ఓవరాల్ గా హిట్ అనిపించుకున్నాడు . సాయి కార్తీక్ రీ రికార్డింగ్ బాగుంది కానీ పాటలు అంతంత మాత్రమే ! మోహనకృష్ణ ఛాయాగ్రహణం ఈ సినిమాకు మరింత అందాన్ని ఇచ్చింది . దిల్ రాజు నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పేదేముంది , ఇప్పటికే పలు హిట్ లు చూసాడు ఈ ఏడాది ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టినట్లే . 
 
ఓవరాల్ గా : 
 
ఈ రాజా ది గ్రేట్ మంచి ఎంటర్ టైనర్


Comments

LATEST GALLERY


80's South Actors Re-Union Party Pics


Mental Madilo Audio Pre -Release


Napoleon Movie Posters


Nagarjuna RGV New Movie Gallery


Mehreen Pirzada New Photos


RGV Nagarjuna Movie Opening


Jawaan Movie Pre Release Launch


Jawaan Audio And Pre Release Event Posters


Gopichand's 25th Film Opening Photos


Vishaka New Gallery


Shravya Rao Latest Stills


Vana Villu Movie Audio Launch


Chalo Movie Teaser Launch


Rashmika Mandanna New Photos


Nayantara Jai Simha Movie Posters

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD