రాజు గారి గది 2 రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

రాజు గారి గది 2 రివ్యూ

Murali R | Published:October 14, 2017, 8:25 AM IST

రాజుగారి గది 2 రివ్యూ 
నటీనటులు : అక్కినేని నాగార్జున , సమంత , సీరత్ కపూర్ తదితరులు 
సంగీతం : తమన్ 
నిర్మాతలు : ప్రసాద్ వి పొట్లూరి , పరం వి పొట్లూరి , నిరంజన్ రెడ్డి 
దర్శకత్వం : ఓంకార్ 
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 13 అక్టోబర్ 2017 


 

Editor Review
కింగ్ నాగార్జున కీలక పాత్రలో ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం '' రాజుగారి గది 2'' . మళయాలంలో హిట్ అయిన చిత్రంలోని మూల కథని తీసుకొని రాజుగారి గది 2 గా రీమేక్ చేసారు . సమంత ఆత్మగా నటించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
క్లోజ్ ఫ్రెండ్స్ అయిన కిషోర్ ( వెన్నెల కిషోర్ ) అశ్విన్ ( అశ్విన్ బాబు ) ప్రవీణ్ ( ప్రవీణ్ ) లు విశాఖ బీచ్ లోని రాజుగారి బంగ్లా లో రిసార్ట్ స్టార్ట్ చేస్తారు . రిస్టార్ కి వచ్చిన సహా ( సీరత్ కపూర్ ) ని ఈ ముగ్గురు స్నేహితులు కూడా లవ్ చేస్తారు . అయితే ఆమె వెంట పడుతున్న సమయంలో రాజుగారి బంగ్లాలో దెయ్యం ఉందన్న విషయం తెలుసుకుంటారు . దాంతో భయపడిపోయి ఫేమస్  మెంటలిస్ట్ అయిన రుద్ర ( నాగార్జున ) ని కలుస్తారు . రాజుగారి బంగ్లా గురించి విన్న రుద్ర రిసార్ట్ కి వస్తాడు ,అక్కడ అమృత ( సమంత ) ఆత్మ తిరుగుతోంది అన్న విషయం తెలుసుకుంటాడు . అసలు అమృత ఎవరు ? రాజుగారి గదిలో ఎందుకు ఉంది ? రుద్ర ఆ ఆత్మ ని రాజుగారి గది నుండి బయటకు పంపించాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
అక్కినేని నాగార్జున 
సమంత 
సీరత్ అందాలు 
క్లైమాక్స్ 
తమన్ రీ రికార్డింగ్ 
 
డ్రా బ్యాక్స్ : 
 
ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ 
 
నటీనటుల ప్రతిభ : 
 
సీనియర్ హీరో నాగార్జున రుద్ర గా మరోసారి సత్తా చాటాడు . మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున అభినయం అద్భుతమనే చెప్పాలి . సుదీర్ఘ కాలం తర్వాత నాగార్జున గురించి కొత్తగా చెప్పేదేముంది ..... వయసు మీద పడుతున్నప్పటికీ చెక్కు చెదరని గ్లామర్ తో అలరిస్తున్నాడు ప్రేక్షకులను . నాగార్జున - సమంత ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి . ఎదుటి మనిషిలోని భావాలను తెలుసుకునే మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా నటించాడు . ఇక సమంత మరోసారి తన అభినయం తో ఆకట్టుకుంది . రెండు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలో సమంత అద్భుతంగా రాణించడమే కాకుండా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఇచ్చింది . సీరత్ కపూర్ కు పెద్దగా నటించడానికి స్కోప్ లేదు కానీ అందాలతో మాత్రం కుర్రాళ్లకు గాలం వేసింది . వెన్నెల కిషోర్ , షకలక శంకర్ , ప్రవీణ్ లు నవ్వించి మెప్పించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
దివాకరన్ ఛాయాగ్రహణం , తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి . పివిపి నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు ఓంకార్ విషయానికి వస్తే ....... మలయాళ చిత్ర హక్కులు తీసుకున్నప్పటికీ అందులోని మూల కథ ని మాత్రమే తీసుకొని మార్పులు చేసి నాగార్జున , సమంత ల చేత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇప్పించి భేష్ అనిపించాడు . దర్శకుడిగా మరోసారి తనని తాను నిరూపించుకున్నాడు ఓంకార్ . గ్రాఫిక్స్ కూడా బాగానే కుదిరాయి రాజుగారి గది 2 చిత్రానికి . 
 
ఓవరాల్ గా : 
 
కింగ్ నాగార్జున అభినయం , సమంత స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ , సీరత్ గ్లామర్ , వెన్నెల కిషోర్ నవ్వులు వెరసి రాజుగారి గది 2 ని హిట్ బాట పట్టించాయి . 


Comments

LATEST GALLERY


80's South Actors Re-Union Party Pics


Mental Madilo Audio Pre -Release


Napoleon Movie Posters


Nagarjuna RGV New Movie Gallery


Mehreen Pirzada New Photos


RGV Nagarjuna Movie Opening


Jawaan Movie Pre Release Launch


Jawaan Audio And Pre Release Event Posters


Gopichand's 25th Film Opening Photos


Vishaka New Gallery


Shravya Rao Latest Stills


Vana Villu Movie Audio Launch


Chalo Movie Teaser Launch


Rashmika Mandanna New Photos


Nayantara Jai Simha Movie Posters

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD