శేఖరం గారి అబ్బాయి రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

శేఖరం గారి అబ్బాయి రివ్యూ

Murali R | Published:October 21, 2017, 11:12 AM IST

నటీనటులు : విన్ను మద్దిపాటి , అక్షిత , షకలక శంకర్ 
సంగీతం : సాయి ఏలేందర్ 
నిర్మాతలు : మద్దిపాటి సోమశేఖర్ రావు , మధు ఫోమ్రా 
దర్శకత్వం : అక్షిత 
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2017


 

Editor Review
హీరోయిన్ అక్షిత మెగా ఫోన్ చేతబట్టి స్టార్ట్ , యాక్షన్ అంటూ చేయించిన సినిమా శేఖరం గారి అబ్బాయి . నిజంగానే శేఖరం అబ్బాయి విన్ను మద్దిపాటి హీరోగా నటించాడు . యాక్షన్ తో కూడిన ప్రేమకథా చిత్రమైన శేఖరం గారి అబ్బాయి ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
పక్కింట్లో ఉండే అందాల భామ అప్సర ( అక్షిత ) ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు సాధిక్ ( విన్ను మద్దిపాటి ). అప్సరతో క్లోజ్ గా ఉంటూ తన ప్రేమని వ్యక్తం చేస్తాడు అయితే పని పాట లేకుండా తిరుగుతున్నశేఖరం అబ్బాయి ప్రేమ ని రిజెక్ట్ చేస్తుంది అప్సర దాంతో తన ప్రేమని గెలిపించుకోవాలన్న నిర్ణయానికి వస్తాడు . సరిగ్గా అదే సమయంలో తన ప్రేమకు అడ్డుగా వస్తాడు ఓ వ్యక్తి , తను ప్రేమిస్తున్న అప్సర కు మరింత దగ్గరౌతాడు . అసలు అప్సర ప్రేమిస్తున్నది ఎవరిని ? విన్ను అప్సర ప్రేమ ని పొందాడా ? తన ప్రేమకు అడ్డుగా ఉన్నది ఎవరు ? ఇత్యాది విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ :
అక్షిత గ్లామర్ 
నిర్మాణ విలువలు 
డ్రా బ్యాక్స్ : 
ఎంటర్ టైన్ మెంట్ 
 
నటీనటుల ప్రతిభ : 
 
విన్ను మద్దిపాటి కి ఈ సినిమా తొలిసినిమా అయినప్పటికీ నటనలో కానీ యాక్షన్ సీన్స్ లో కానీ బాగానే చేసాడు . అలాగే హీరోయిన్ అక్షిత తో కలిసి రొమాంటిక్ సీన్స్ కూడా బాగా చేసాడు . ఇక అక్షిత హీరోయిన్ గా అందాలను ఆరబోయడమే కాకుండా డైరెక్టర్ గా కూడా ఫరవాలేదనిపించింది . షకలక శంకర్ తో పాటు మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు . 
 
సాంకేతిక వర్గం : 
 
కొత్త నిర్మాతలు అయినప్పటికీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు ,సాయి ఏలేందర్ సంగీతం ఫరవాలేదు . ఛాయాగ్రహణం కూడా సినిమాకు మరింత ప్లస్ అయ్యింది . ఇక దర్శకులు అక్షిత విషయానికి వస్తే ......... హీరోయిన్ గా నటిస్తూనే డైరెక్షన్ చేయడం సాహసమే ! ఫ్యామిలీ ఎమోషన్స్ తో కథ రాసుకొని ప్రజెంట్ చేసింది కానీ ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా మరోలా ఉండేది . 


Comments

LATEST GALLERY


Naga Chaitanya Savyasachi Frist Look


Nivetha Pethuraj New Photos


Napolean Movie Press Meet


80's South Actors Re-Union Party Pics


Mental Madilo Audio Pre -Release


Napoleon Movie Posters


Nagarjuna RGV New Movie Gallery


Mehreen Pirzada New Photos


RGV Nagarjuna Movie Opening


Jawaan Movie Pre Release Launch


Jawaan Audio And Pre Release Event Posters


Gopichand's 25th Film Opening Photos


Vishaka New Gallery


Shravya Rao Latest Stills


Vana Villu Movie Audio Launch

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD