స్పైడర్ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

స్పైడర్ రివ్యూ

Murali R | Published:September 28, 2017, 12:00 AM IST

స్పైడర్ రివ్యూ 
నటీనటులు : మహేష్ బాబు , రకుల్ ప్రీత్ సింగ్ , ఎస్ జె సూర్య తదితరులు 
సంగీతం : హరీష్ జైరాజ్ 
నిర్మాతలు : ఎన్వీ ప్రసాద్ , ఠాగూర్ మధు 
దర్శకత్వం : ఏ.ఆర్.మురుగదాస్ 
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017


 

Editor Review
సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా తెలుగు , తమిళ బాషలలో చేసిన ద్విభాషా చిత్రం స్పైడర్ . ఏ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్పైడర్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈరోజు రిలీజ్ అయ్యింది . మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి . మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
ఇంటలిజెన్స్ బ్యూరో లో పని చేసే శివ ( మహేష్ బాబు ) ప్రజల ఫోన్ లను వింటూ వాళ్లకు రాబోతున్న ప్రమాదాలను ముందుగానే పసిగట్టి ప్రజల మెప్పు పొందుతుంటారు . హత్య జరిగిన తర్వాత ఇంటరాగేషన్ చేసి హంతకులను పట్టుకునే పోలీస్ జాబ్ కన్నా స్పై జాబే ఎన్నో రేట్లు సంతృప్తి ఇస్తుందని , ప్రజలకు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరించి కాపాడటంలోనే సంతృప్తి చెందుతుంటాడు . అయితే ఒకరోజు ఒక అమ్మాయి తన స్నేహితురాలికి ఫోన్ చేసి ఇంట్లో ఒంటరిగా ఉన్నానని భయంగా ఉందని తనకు తోడుగా రమ్మని కోరుతుంది దాంతో ఈ మాటలు విన్న శివ తన ఫ్రెండ్స్ అయిన లేడీ  కానిస్టేబుల్ కి చెప్పి ఆ యువతి కి సహాయంగా ఉండమని కోరతాడు కట్ చేస్తే తెల్లవారి ఆ ఇద్దరినీ అత్యంత కిరాతకంగా ఎవరో హత్య చేస్తారు . ఆ హత్యల వివరాలను తెలుసుకున్న శివ షాక్ అవుతాడు . అసలు హంతకుడు ఎవరు ? వీళ్ళని ఎందుకు హత్య చేసాడు ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తూ సైకో భైరవ ( ఎస్ జె సూర్య ) గురించిన సంచలన విషయాలు తెలుసుకుంటాడు . చిన్నతనంలోనే అత్యంత పాశవికంగా హత్యలు చేసిన సైకో భైరవ ని శివ ఎలా పట్టుకున్నాడు . హైదరాబాద్ మహానగరానికి రాబోయే ప్రళయాన్ని ఎలా అడ్డుకున్నాడు  తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
మహేష్ బాబు 
ఎస్ జె సూర్య సైకో క్యారెక్టర్ 
సెకండాఫ్ 
రీ రికార్డింగ్ 
నిర్మాణ విలువలు 
 
డ్రా బ్యాక్స్ : 
 
పాటలు 
ఎంటర్ టైన్ మెంట్ 
 
నటీనటుల ప్రతిభ : 
 
ఐబి ఆఫీసర్  శివ గా మహేష్ బాబు అద్భుతంగా చేసాడు . మైండ్ గేమ్ గా సాగే విలన్ వేట ఎపిసోడ్ బాగుంది . లుక్స్ పరంగా మహేష్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు . మహేష్ - రకుల్ ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది . రకుల్ ప్రీత్ సింగ్ కు పెద్దగా నటించే స్కోప్ లేదు కానీ ఉన్నంతలో మెప్పించింది . తమిళ హీరో భరత్ విలన్ గా ఫరవాలేదనిపించాడు . ఇక ఎస్ జె సూర్య విషయానికి వస్తే సైకో పాత్రలో బాగా మెప్పించాడు . నిజమైన సైకో లాగే అతడి బిహేవియర్ ఉంది , నిజంగానే మరో విలన్ ఎస్ జె సూర్య రూపంలో దొరికాడు ఇండస్ట్రీ కి . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
సంతోష్ శివన్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్  అద్భుతంగా వచ్చిందంటే సంతోష్ శివన్ అనుభవమే కారణం . సంతోష్ శివన్ అద్భుత ఛాయాగ్రహణం కు తోడు గ్రాఫిక్స్ కుదిరాయి దాంతో లావిష్ గా కనబడింది స్పైడర్ . అలాగే హరీష్ జైరాజ్ సంగీతం కూడా .  పాటల్లో అంతగా తన సత్తా ని చాటలేక పోయాడు హరీష్ కానీ రీ రికార్డింగ్ లో మాత్రం అదరగొట్టాడు హరీష్ జైరాజ్ . నిర్మాణ విలువలు బాగున్నాయి . మహేష్ - మురుగదాస్ ల కోసం అత్యంత భారీ బడ్జెట్ ని కేటాయించి పొటెన్షియాలిటీ చూపించారు నిర్మాతలు . ఇక దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ విషయానికి వస్తే ....... ...... కథ , స్క్రీన్ ప్లే , మాటలు , దర్శకత్వం ఇలా నాలుగు విభాగాలను హ్యాండిల్ చేసాడు . ఫేస్ బుక్ , వాట్సాప్ , టివి , ల్యాప్ టాప్ లకు అతుక్కుపోవడం కాదు పక్కనున్న మనిషి కి మన ప్రేమని , ఆప్యాయత ని షేర్ చేయండి అంటూ సందేశం ఇచ్చారు , కానీ మరింత జనరంజకంగా ఈ కథ ని అల్లుకుంటే బాగుండేది , బిసి కేంద్రాల్లోని ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా రూపొందించి ఉంటే ఖచ్చితంగా పోకిరి లా బ్లాక్ బస్టర్ అయ్యేది కానీ మహేష్ లాంటి సూపర్ స్టార్ కి ఇది ఓ హిట్ చిత్రం మాత్రమే అయ్యింది . 
 
ఓవరాల్ గా : 
 
మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి , ఆ రేంజ్ లో సినిమా లేదు కానీ మహేష్ అభిమానులకు , ఏ సెంటర్ లలోని జనాలకు ఈ సినిమా నచ్చడం ఖాయం . బ్లాక్ బస్టర్ అనే రేంజ్ లో సినిమా రిలీజ్ అయ్యింది . మహేష్ - రకుల్ జంట , అలాగే ఎస్ జె సూర్య సైకో విలనిజం , విజువల్ గ్రాండియర్ ....... హరీష్ జైరాజ్ నేపథ్య సంగీతం వెరసి స్పైడర్ ప్రేక్షకులను అలరిస్తుంది .


Comments

LATEST GALLERY


Hey Pillagada Movie Posters


Lakshmi Manchu Latest Gallery


Naga Chaitanya Savyasachi Frist Look


Nivetha Pethuraj New Photos


Napolean Movie Press Meet


80's South Actors Re-Union Party Pics


Mental Madilo Audio Pre -Release


Napoleon Movie Posters


Nagarjuna RGV New Movie Gallery


Mehreen Pirzada New Photos


RGV Nagarjuna Movie Opening


Jawaan Movie Pre Release Launch


Jawaan Audio And Pre Release Event Posters


Gopichand's 25th Film Opening Photos


Vishaka New Gallery

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD