Home రివ్యూస్ వెంకటాపురం రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

వెంకటాపురం రివ్యూFriday May 12th 2017

నటీనటులు    : రాహుల్ , మహిమ మక్వాన తదితరులు
సంగీతం        : అచ్చు
నిర్మాణం       : గుడ్ సినిమా గ్రూప్
దర్శకత్వం     : వేణు మడికంటి
రేటింగ్         : 3.25/ 5
రిలీజ్ డేట్     : 12 మే 2017


 

Editor Review
హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాహుల్ హీరోగా వేణు ని దర్శకుడిగా పరిచయం చేస్తూ గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ , ఫణికుమార్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం '' వెంకటాపురం '' . రిలీజ్ కి ముందు క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక కూడా ప్రేక్షకుల ఆదరణ పొందేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
పిజ్జా డెలివరీ బాయ్ అయిన ఆనంద్ ( రాహుల్ ) కాలేజ్ స్టూడెంట్ అయిన చైత్ర ( మహిమ ) ఇద్దరూ కలిసి ఒకే చోట అద్దెకు దిగుతారు . ఈ ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది . అయితే అకస్మాత్తుగా చైత్ర , ఆనంద్ జీవితాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటాయి . తను కొనుక్కున్న కొడవలి కనిపించకుండా పోతుంది దాంతో వెంకటాపురం  పోలీసులను ఆశ్రయిస్తాడు ఆనంద్ . సరిగ్గా అదే సమయంలో భీమిలి బీచ్ లో ఓ మూటలో శవం కనిపిస్తుంది . ఆ శవం ఎవరిదీ ? చైత్ర జీవితంలో ఏర్పడిన కల్లోలం ఏంటి ? ఆనంద్ కొడవలి ఏమైంది ఇత్యాది విషయాలన్నీ తెలియాలంటే వెంకటాపురం ని చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
రాహుల్ అభినయం 
సెకండాఫ్ 
సినిమాటోగ్రఫీ 
రీ రికార్డింగ్ 
 
నటీనటుల ప్రతిభ : 
 
హ్యాపీ డేస్ లో నటించిన రాహుల్ కి ఈ వెంకటాపురం లో నటించిన రాహుల్ ని చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం . ఆ రాహులేనా ఈ రాహుల్ అని అనిపించకమానదు . తనని తానూ మలుచుకున్న తీరుకి నిజంగా అభినందించాల్సిందే . సిక్స్ ప్యాక్ ని ట్రై చేయడమే కాకుండా లుక్ పరంగా , బాడీ లాంగ్వేజ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు రాహుల్ . అలాగే కొత్త అమ్మాయి మహిమ మక్వాన తో రాహుల్ కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది . మహిమ కూడా బాగానే చేసింది . ఇక మిగిలిన పాత్రల్లో అజయ్ ఘోష్ , అజయ్ లు బాగానే చేసారు . 
 
సాంకేతిక వర్గం : 
 
సాయి ప్రకాష్ ఛాయాగ్రహణం, అచ్చు రీ రికార్డింగ్  ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి . పరిమిత బడ్జెట్ సినిమా అయినప్పటికీ విజువల్స్ పరంగా తనకున్న అడ్వాంటేజ్ ని వైజాగ్ , భీమిలి అందాలను ఒడిసి పట్టుకొని దృశ్య రూపం ఇచ్చాడు సాయి ప్రకాష్ . సాయి ఇచ్చిన విజువల్స్ కి అదే స్థాయిలో నేపథ్య సంగీతాన్ని అందించి సినిమాని మరింతగా ఎలివేట్ చేసాడు అచ్చు . నేపథ్య సంగీతం తో మాత్రమే కాకుండా రెండు మంచి పాటలను అందించాడు అచ్చు . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకులు వేణు విషయానికి వస్తే ........ మర్డర్ మిస్టరీ ని రెండు గంటల పాటు సక్సెస్ ఫుల్ గా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు . కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే పరంగా ఇబ్బంది పడినప్పటికీ ఓవరాల్ గా ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా చేసాడు . 
 
ఓవరాల్ గా : 
 
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన వెంకటాపురం చిత్రం ఓ వర్గం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది . రాహుల్ - మహిమ పెర్ఫార్మెన్స్ , వేణు దర్శకత్వ ప్రతిభ , గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణం , సాయి ప్రకాష్ కెమెరా పనితనం వెరసి వెంకటాపురం ప్రేక్షకులకు నచ్చే సినిమా .
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD