సామి 2 మోషన్ పోస్టర్ ట్రెండింగ్


saamy square motion poster trending in social media2003 లో విడుదలై తమిళనాట సంచలన విజయం సాధించిన చిత్రం ” సామి ” . హరి దర్శకత్వంలో తెరకెక్కిన సామి చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు చియాన్ విక్రమ్ . సామి చిత్రంతో తిరుగులేని స్టార్ డం ని అందుకున్నాడు అలాగే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాడు విక్రమ్ . ఆ చిత్రమే తెలుగులో ”లక్ష్మీ నరసింహా ” పేరుతో రీమేక్ చేసాడు బాలయ్య . 2004 లో విడుదలైన లక్ష్మీ నరసింహా కూడా సూపర్ హిట్ అయ్యింది తెలుగునాట . కట్ చేస్తే ఆ సామి చిత్రానికి తిరిగి పదిహేనేళ్ల తర్వాత సీక్వెల్ చేస్తున్నారు విక్రమ్ – హరి లు .

తాజాగా సామి 2 మోషన్ పోస్టర్ విడుదల చేసారు , అసలే బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ కావడంతో మోషన్ పోస్టర్ విడుదల అవ్వడమే ఆలస్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది సామి 2 మోషన్ పోస్టర్ . విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .