సాయి ధరమ్ తేజ్ హిట్ కొడతాడా

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తాజాగా నటించిన చిత్రం ” ఇంటలిజెంట్ ”. మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . జవాన్ చిత్రం ఓ మాదిరిగా ఆడింది కానీ దానికంటే ముందు వచ్చిన మూడు చిత్రాలు కూడా భారీ డిజాస్టర్ లుగా నిలిచి మెగా మేనల్లుడి పరువు ని తీసిపడేసాయి . దాంతో వివివినాయక్ తో కలిసి పని చేసాడు . 
 
మాస్ ఎంటర్ టైనర్ లకు , ఫక్తు కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ వినాయక్ చిత్రాలు దాంతో కొత్తదనం అంటూ ఏముండదు , ఇక ఇంటలిజెంట్ టీజర్ కూడా అలాగే కొత్తదనం అంటూ ఏమిలేకుండా ఉంది . వినాయక్ కొడితే హిట్టు లేదంటే ఫట్టు . మరి ఈ ఇంటలిజెంట్ హిట్ కొడతాడా లేక రెగ్యులర్ చిత్రమని ప్రేక్షకులు తిప్పి కొడతారో చూడాలి . అది తేలాలి అంటే ఫిబ్రవరి 9 వరకు ఎదురు చూడాల్సిందే .