నాని వదిలేసిన సినిమాతో కొడతాడా


saidharam tej eagerly waiting for successనాని రిజెక్ట్ చేసిన సినిమాని ఓకే చేసాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ . నేను శైలజ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకుడు కాగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించనుంది . నాని ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు కానీ నాని కోరుకున్న విధంగా పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ రాకపోవడంతో ఆ సినిమానుండి తప్పుకున్నాడు దాంతో అదే స్క్రిప్ట్ ని మెగా మేనల్లుడి కి వినిపించారు .

కథ నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు కట్ చేస్తే ”చిత్రలహరి ”గా నామకరణం చేసారు ఆ సినిమాకు . ఇక హీరోయిన్ ఎవరో తెలుసా ….. లై , చల్ మోహన్ రంగ చిత్రాల్లో నితిన్ తో రొమాన్స్ చేసిన మేఘా ఆకాష్ . అయితే మెగా మేనల్లుడు గతకొంత కాలంగా ఘోర పరాజయాలను ఎదుర్కొంటున్నాడు . ఇప్పుడేమో నాని వదిలేసిన సినిమాని అందుకున్నాడు . ఈ సినిమాతో మెగా మేనల్లుడు హిట్ కొడతాడా చూడాలి .