బాలయ్య ని తప్పుపట్టిన సాయికుమార్


saikumar comments on balakrishna నందమూరి బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీ పై ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే , దాంతో జాతీయ స్థాయిలో రచ్చ రచ్చ అయ్యింది . అయితే దేశ ప్రధాని పై ఇలాంటి అభ్యంతరకరమైన భాషలో విమర్శలు చేయడం సరికాదని బాలయ్య ని తప్పు పట్టాడు నటుడు సాయికుమార్ . భారతీయ జనతా పార్టీలో గతకొంత కాలంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు సాయికుమార్ .

గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు సాయికుమార్ , అయితే ఇప్పుడు మాత్రం ఎలాగైనా సరే గెలవాలని ఆశపడుతున్నాడు . త్వరలో కర్ణాటకలో జరగబోయే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చిక్బల్లాపూర్ జిల్లా భాగేపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాడు . గెలిస్తే శాసనసభ లో అడుగు పెడతాడు . సాయికుమార్ తెలుగువాడు అయినప్పటికీ కర్ణాటక లో అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది అలాగే అక్కడే బిజెపి తరుపున ప్రచారం చేస్తున్నాడు కూడా .