చిత్తుగా ఓడిపోయిన సాయికుమార్


saikumar loses in karnataka electionsనటుడు సాయి కుమార్ కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు . భాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసాడు సాయికుమార్ . గత ఎన్నికల్లో కూడా ఇదే స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు అయితే ఇక్కడ తెలుగువాళ్లు అధికంగా ఉండటం అలాగే సాయికుమార్ కు కన్నడంలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా టికెట్ ఇచ్చారు . అయితే కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారెడ్డి కి కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయాడు . సాయి కుమార్ కు ఇక్కడ డిపాజిట్ కూడా రాలేదంటే ఎంత చిత్తుగా ఓడిపోయాడో అర్ధం చేసుకోవచ్చు .

సాయి కుమార్ తెలుగువాడు అయినప్పటికీ కన్నడంలో పోలీస్ స్టోరీ చిత్రంతో స్టార్ డం తెచ్చుకున్నాడు దాంతో అక్కడ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది . అలాగే తెలుగులో కూడా పలు చిత్రాల్లో విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు . పవన్ కళ్యాణ్ వచ్చి నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసాడు ప్రచార సమయంలో కట్ చేస్తే డిపాజిట్ కూడా రాలేదు పాపం సాయి కుమార్ కు దాంతో రాజకీయాలపై విరక్తి కలిగేలా ఉంది సాయికుమార్ పరిస్థితి .