ఆ హీరోయిన్ ని ఆదుకుంటానన్న సల్మాన్


salman khan responds on pooja issueక్షయ వ్యాధితో బాధపడుతూ ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హీరోయిన్ పూజా దడ్వాల్ ని ఎట్టకేలకు ఆదుకుంటానని మాట ఇచ్చాడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ . పూజా దడ్వాల్ – సల్మాన్ ఖాన్ లు ఇద్దరూ కలిసి ” వీర్ ఘటి ” సినిమాలో నటించారు , ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది అయితే ఆ తర్వాత మళ్ళీ సల్మాన్ తో పూజా నటించలేదు కానీ గతకొంత కాలంగా క్షయ వ్యాధితో బాధపడుతోంది .

ప్రస్తుతం ఆమె దగ్గర డబ్బులు కూడా లేకపోవడం , బంధు మిత్రులు ఆమెని దూరంగా పెట్టడంతో దీనస్థితిలో ఉంది . ఈ విషయం మీడియాకు తెలియడంతో సల్మాన్ దృష్టి కి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసింది మొత్తానికి ఆలస్యమైనప్పటికీ సల్మాన్ కి ఈ విషయం తెలియడంతో స్పందించాడు . తప్పకుండా పూజా దడ్వాల్ ని ఆదుకుంటానని అలాగే ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపాడు సల్మాన్ .