మాజీ లవర్ సిద్దార్థ్ పై కామెంట్ చేసిన సమంత


samantha comments on ex lover siddharthమాజీ లవర్ సిద్దార్థ్ పై కామెంట్ చేసి సంచలనం సృష్టించింది సమంత అక్కినేని . మహానటి చిత్రంలో సావిత్రి జెమిని గణేశన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది , అయితే అప్పటికే జెమిని గణేశన్ కు పెళ్లి అవుతుంది కాబట్టి సావిత్రి జీవితం నాశనం అయ్యిందని నాకు కూడా అలాంటి గతి నా మాజీ లవర్ వల్ల కలిగేదని అంతటి ఘోర ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నానని , అతడి ప్రేమలో నిజాయితీ లేదనే విషయం తెలియడం వల్ల అతడికి దూరంగా వెళ్లానని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించింది సమంత .

సమంత – సిద్దార్థ్ లు ప్రేమించుకున్న విషయం తెలిసిందే . అయితే అంతకుముందే సిద్దార్థ్ కు పెళ్లి అయి విడాకులు కూడా తీసుకున్నాడు కట్ చేస్తే …… జబర్దస్త్ అనే సినిమా సమయంలో ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది , ఇక పెళ్లి కావడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో సిద్దార్థ్ నుండి విడిపోయింది సమంత . ఆ సమయంలో నాగచైతన్య ఇచ్చిన సలహాలు , చూపిన ఓదార్పు చైతు తో ప్రేమలో పడేలా చేసింది కట్ చేస్తే ….. అక్కినేని వారి కోడలు అయ్యింది సమంత . చైతు సలహాలు కానీ తీసుకోకపోయి ఉంటే సావిత్రి లాగే నా జీవితం అయ్యేది అంటూ ఆ భయానక పరిస్థితులను మరోసారి గుర్తు చేస్తోంది సమంత .