శర్వానంద్ తప్పు చేస్తున్నాడా


sharwanand give chance to flop directorsవరుస విజయాలు సాధిస్తున్న శర్వానంద్ విజయగర్వంతో వరుసగా ముగ్గురు ప్లాప్ దర్శకులకు ఛాన్స్ ఇచ్చాడు , అందులో ఒక సినిమా సెట్స్ మీద ఉంది కూడా త్వరలోనే మరో సినిమా సెట్స్ పైకి రానుండగా తాజాగా మరో ప్లాప్ డైరెక్టర్ తో కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది . ఈ ముగ్గురు దర్శకులు కూడా దాదాపుగా డిజాస్టర్ లు ఇచ్చిన దర్శకులు సుమా ! ఒకరేమో ” లై ” అనే డిజాస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన హను రాఘవపూడి కాగా మరొకరు సుధీర్ వర్మ ఇక ముచ్చటగా మూడో వ్యక్తి ” శ్రీకాంత్ అడ్డాల” .

దాదాపుగా ఈ దర్శకుడి ని చాలామంది మర్చిపోయారు ఎందుకంటే మహేష్ బాబు కి బ్రహ్మోత్సవం అనే చెత్త సినిమా తీసి పెట్టాడు . మహేష్ తో శ్రీకాంత్ అడ్డాల సినిమా అనగానే చాలామంది హీరోలు , నిర్మాతలు తమ తదుపరి సినిమా కోసం శ్రీకాంత్ అడ్డాల కోసం ఎదురు చూసారు అయితే ఎప్పుడైతే బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయ్యిందో అప్పుడు ఒక్కరు కూడా అతడితో సినిమా చేయాలంటే భయపడ్డారు . దాంతో చాలాకాలం పాటు కనిపించలేదు కానీ ఎలాగో అలా శర్వానంద్ కి కథ చెప్పి ఒప్పించాడు . సక్సెస్ లను చూస్తున్న శర్వానంద్ ఒక్కసారిగా ప్లాప్ దర్శకులతో సినిమాలను అంగీకరిస్తుంటే శర్వానంద్ తప్పు చేస్తున్నాడేమో ! అని అంటున్నారు అయితే అదే సమయంలో కథ బాగా నచ్చడం వల్లే ఒప్పుకొని ఉంటాడని లేకపోతె శర్వా ఒప్పుకునే రకం కాదని కూడా వినిపిస్తోంది . అయితే శర్వా కు కథ నచ్చినా అది ప్రేక్షకులకు నచ్చాలి అప్పుడే శర్వా తప్పు చేశాడా ? లేదా అన్నది తేలుతుంది .