మంకీ బీజ్ సంస్థ ‘కిడ్స్ క్యాలెండర్’ ను విడుదల చేసిన మా అధ్యక్షుడు శివాజీ రాజా..

మంకీ బీజ్ సంస్థ నిర్వహకుడు మణి,  వండర్ కిడ్స్ 2వ ఎడిషన్ క్యాలెండర్ ను ఆదివారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా మా అధ్యక్షుడు శివాజీ రాజా, మరియు టాలీవుడ్ దర్శకుడు వి ఎన్. ఆదిత్య, నటి సిమ్రాన్ చౌదరిల చేతుల మీదుగా విడుదల చేయించారు.. ఈ కార్యక్రమం లో భాగంగా ముఖ్య అతిథి శివాజీ రాజా మాట్లాడుతూ ఈ క్యాలెండర్ మేకింగ్ వీడియో చూసాను కిడ్స్ అంతా పోటీపడి మరి నటించారు  వీరికి సినిమా అవకాశాలు కల్పించాలనుకునే వారు నన్ను సంప్రదించండని తెలిపారు… చిన్న పిల్లలతో క్యాలెండర్ తీయాలి అనే ఆలోచన వచ్చినందుకు మణి గారిని అభినందించాల్సిందే.. చైల్డ్ ఆర్టిస్టులు కరువవుతున్న సందర్భం లో కిడ్స్ క్యాలెండర్ రావడం ఆనందంగా ఉందన్నారు దర్శకుడు వి ఎన్ ఆదిత్య. ఇక నటి సిమ్రాన్ చౌదరి చిన్న పిల్లలో చాలా టాలెంట్ కలిగిన వారున్నారు. ఇలాంటి వేదిక వీరికి మంచి భవిష్యత్తునిస్తుందని భావిస్తున్నా.. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న మణి గారిని అభినందిస్తున్నా అని అన్నారు. మంకీ బీజ్ నిర్వాహకుడు మణి మాట్లాడుతూ 350 మంచి కిడ్స్ ఈ ఆడిషన్స్ లో పాల్గొనగా కేవలం 12మంది ఎంపికయ్యారు.. వీరితో ఈ క్యాలెండర్ ను చేయడం, దాన్ని శివాజీ రాజా గారు విడుదల చేయడం.. మిగిలినవారందరూ నన్ను ప్రోత్సహించడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని, వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలని తెలియచేసారు.