తమన్నా పై బూటుతో దాడి

మిల్కీ బ్యూటీ తమన్నా పై బూటు తో దాడి చేసాడు ఓ యువకుడు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఈరోజు ఉదయం హైదరాబాద్ మహానగరంలో జరిగింది . మలబార్ బంగారు దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చింది తమన్నా . హిమాయత్ నగర్ రద్దీ ఏరియా కావడంతో తమన్నా ని చూసేందుకు ఎగబడ్డారు యువత , అయితే బౌన్సర్లు అతిగా స్పందించడం వల్ల చూసేందుకు వచ్చిన కరీముల్లా అనే బిటెక్ చదువుతున్న యువకుడు బూటుని తమన్నా పైకి విసిరాడు అయితే ఆ బూటు తమన్నా కు తగలేకపోవడంతో నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు . 
 
వెంటనే అక్కడే ఉన్న పోలీసులు కరీముల్లా ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు . తమన్నా కు వీరాభిమానినని కానీ గతకొంత కాలంగా ఆమె సరైన సినిమాలు చేయడం లేదని అందుకే ఆగ్రహంతో ఇలా చేసానని చెబుతున్నాడు పోలీసులకు . అయితే పోలీసులు మాత్రం కరీముల్లా ని పరి పరి విధాలుగా దర్యాప్తు చేస్తున్నారు .