శ్రియా పెళ్లి ఫోటో సంచలనం సృష్టిస్తోంది


Shriya Saran wedding pics and videos are going viralహాట్ భామ శ్రియా శరన్ పెళ్లి మార్చి 12న రహస్యంగా జరిగింది , అయితే ఆ పెళ్లి గురించి మొదట్లో వార్తలు వచ్చినప్పటికీ శ్రియా తో పాటుగా శ్రియా తల్లి ఖండించారు కట్ చేస్తే కొద్దిమంది సమక్షంలో మార్చి 12న ముంబై లో రహస్య వివాహం చేసుకుంది శ్రియా . రష్యా కి చెందిన అండ్రీ కొచ్చీవ్ ని పెళ్లి చేసుకుంది శ్రియా శరన్ .

అయితే శ్రియా శరన్ రహస్య వివాహం చేసుకున్నట్లు మీడియాలో పెద్దగా వచ్చినప్పటికీ శ్రియా పెద్దగా పట్టించుకోలేదు కానీ వారం రోజుల తర్వాత మాత్రం శ్రియా పెళ్లి ఫోటోలు లీక్ కావడంతో సంచలనం గా మారింది . ప్రస్తతం సోషల్ మీడియాలో శ్రియా శరన్ అండ్రీ కొచ్చీవ్ ల వివాహ ఫోటోలు వైరల్ అవుతున్నాయి . తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించిన ఈ భామ 35 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుని ఓ ఇంటిదయ్యింది .