సింగర్ చిన్మయిని లైంగికంగా వేధించారట


singer chinmayi sripaada reveals how she was sexually harassedప్రముఖ సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారమే లేపింది . తనపై లైంగికంగా వేధించారని , తాకకూడని చోట తాకి శునకానందం పొందారని ఇలాంటి సంఘటనలు నాకు ఒక్క దానికి మాత్రమే కాదు ప్రతీ అమ్మాయి ఎదుర్కొంటున్న విషయమే అని తేల్చిచెప్పింది . చిన్మయి వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి . గతకొంతకాలంగా మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే .

 

నాపైన మాత్రమే కాదు అమ్మాయిలపైన అలాగే అబ్బాయిలపైన కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని అయితే అందరూ ఈ విషయాన్నీ బయటకు మాత్రం చెప్పడం లేదు . ఒకవేళ చెబితే తల్లిదండ్రుల నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అన్న భయంతో చాలామంది చెప్పడం లేదని అయితే ఇప్పుడు కాస్త పరిస్థితి మారిందని అంటోంది చిన్మయి .