20వ కళాసుధ అవార్డుల ప్రధానం


Sri Kala Sudha Awards Announcementశ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా తెలుగు
సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ
కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఈ ఉగాది సందర్భంగా కళాసుధ
తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ ఉగాది పురస్కారాలను అందించనుంది. ఈ
సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు

బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1998 నవంబర్ 21న ప్రారంభించబడి గత 20
సంవత్సరాలుగా తెలుగు సినీ కళాకారులకు అవార్డులు అందిస్తున్నాం. ఈ ఏడాది
20వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఉగాది రోజున చెన్నయ్‌లో
పురస్కారాల్ని అందజేయనున్నాం. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 20 మంది అవార్డు
గ్రహీతలకు వెండి కిరీట ధారణ చేయాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ మంత్రి ఘంటా శ్రీనివాసరావు, మండలి
బుద్ధప్రసాద్, వరప్రసాద్‌రెడ్డి, ఎ.ఎమ్.రత్నం, రామ్మోహన్‌రావు లాంటి
ప్రముఖులు హాజరవుతున్నారు.

ఉగాది రోజున చెన్నయ్‌లోని మ్యూజిక్ అకాడమీలో ఈ
వేడుక జరగనుంది అన్నారు. ఫణిమాధవ్ మాట్లాడుతూ కళాసుధ 20వ వసంతోత్సవం
సందర్భంగా అందిస్తున్న అవార్డులు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమం
త్రివేణి సంగమంగా జరగనుంది. సినీ అవార్డులతోపాటు మహిళారత్న పురస్కారాలు
అందజేయనున్నాం. జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ దర్శకులు
కె.విశ్వనాథ్‌గారికి అందిస్తున్నాం. బాపు-రమణ అవార్డును సాయికుమార్‌కు,
బాపు బొమ్మ అవార్డును సీనియర్ నటి మాధవికి అందజేయనున్నాం అన్నారు. ఈ
కార్యక్రమంలో శ్రీనివాస్, నిర్మాత కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కళాసుధ ఉగాది పురస్కార గ్రహీతలు:
ఉత్తమ చిత్రం- శతమానం భవతి
ఉత్తమ ఆధ్యాత్మిక చిత్రం- ఓం నమో వేంకటేశాయ
ఉత్తమ సామాజిక చిత్రం- నేనే రాజు నేనే మంత్రి
ఉత్తమ హీరో- రానా
ఉత్తమ దర్శకుడు- క్రిష్ (గౌతమీపుత్ర శాతకర్ణి)
ఉత్తమ నటి- కాజల్
ప్రత్యేక జ్యూరీ అవార్డు- విజయ్ దేవరకొండ
ఉత్తమ సంగీత దర్శకుడు- థమన్
ఉత్తమ కెమెరామెన్- ఛోటాకె.నాయుడు
ఉత్తమ నూతన నటుడు- ఘంటా రవితేజ్
ఉత్తమ నూతన నటీమణులు- రితికాసింగ్, సాయిపల్లవి, షాలినీ పాండే
ఉత్తమ పాటల రచయిత- సుద్దాల అశోక్‌తేజ
ఉత్తమ నూతన దర్శకురాలు- సుధా కొంగర (గురు)