పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి


పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ అభిమానులం అని చెప్పుకునే కొంతమంది మమ్మల్ని బెదిరిస్తున్నారని , ఫ్యాన్స్ ఉంది కేవలం పవన్ కళ్యాణ్ కేనా ? అయినా అభిమానులను హద్దుల్లో పెట్టుకోకుండా ఎవరు నోరు ఎత్తితే వాళ్ళని  పవన్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని మేము అలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అంటోంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి అలియాస్ శ్రీ శక్తి . శ్రీరెడ్డి అనే తన పేరుని ఇటీవలే శ్రీ శక్తి గా మార్చుకుంది ఈ వివాదాస్పద నటి .

ఇటీవల ఓ జూనియర్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసింది , బెంగాలీ కి చెందిన అమ్మాయిలతో పవన్ కళ్యాణ్ మసాజ్ చేయించుకుంటాడని అతడు రాజకీయాల్లోకి వచ్చి ఏం న్యాయం చేస్తాడని పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే . అంతే వెంటనే పవన్ ఫ్యాన్స్ సదరు జూనియర్ ఆర్టిస్ట్ ని బెదిరించారు దాంతో పలాయనం చిత్తగించింది . అందుకే శ్రీరెడ్డి అలియాస్ శ్రీ శక్తి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది .