పవన్ కళ్యాణ్ ని విమర్శించిన శ్రీరెడ్డి


srireddy comments on pawan kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి . సినిమారంగంలో ఆడవాళ్ళ పై అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ అక్కడ స్పందించని పవన్ మాకు మాత్రం నీతులు చెప్పడంలో అర్ధం ఏంటని ఇకపై పవన్ కళ్యాణ్ ని ఎవరు కూడా మద్దతు అడగొద్దని పేర్కొంది శ్రీరెడ్డి . మా సభ్యత్వం ఇవ్వకపోవడంతో శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే .

అయితే శ్రీరెడ్డి అలా చేయడం తప్పని ఏదైనా సమస్య ఉంటే పోలీసులను ఆశ్రయించాలి కానీ బట్టలు విప్పి నిరసన తెలపడం సరైన పద్దతి కాదని పవన్ కళ్యాణ్ అన్నమాట తెలిసిందే . దాంతో అతడి కి బాగానే కౌంటర్ ఇచ్చింది శ్రీరెడ్డి .మీరు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని నిరసన వ్యక్తం చేసారు ? అలా ఎందుకు చేసారు …… హోదా కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు కదా అంటూ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించింది శ్రీరెడ్డి .