నాగబాబు కాల్ చేసి బెదిరిస్తున్నాడు : శ్రీరెడ్డి


srireddy controversial tweets on nagababu మెగా హీరో నాగబాబు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని , నాకు ఏమైనా జరిగితే దానికి పూర్తిగా మెగా ఫ్యామిలీ దే బాధ్యత అంటూ మరో బాంబ్ పేల్చింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి . టాలీవుడ్ లో గత నెలరోజులుగా శ్రీరెడ్డి ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ అట్టుడికిపోగా కాస్టింగ్ కౌచ్ కాస్త వ్యక్తులను టార్గెట్ చేసే వ్యవహారంలా మారడంతో పెను సంచలనం అయ్యింది .

పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన శ్రీరెడ్డి ని మెగా అభిమానులు బూతులు తిడుతుండగా ఇప్పుడు నాగబాబు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని నాకేదైనా జరగరానిది జరిగితే అందుకు బాధ్యత మెగా కుటుంబానిదే అంటూ ట్వీట్ చేసి మరింతగా రెచ్చగొడుతోంది . శ్రీరెడ్డి చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది . ” నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి , ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లో నాగబాబు దగ్గర నుండి , నాకు ఏమన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యత మెగా ఫ్యామిలీ దే , ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న నా వాంగ్మూలం .” అంటూ ముఖ్యమంత్రి కి , ప్రధాని కి కూడా ఈ సందేశం చేరేలా ట్వీట్ చేసి మెగా కుటుంబాన్ని మరింత ఇరుకున పెట్టింది .