కేటీఆర్ ని ప్రశ్నించిన శ్రీరెడ్డి


srireddy question to minister ktrతెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ని ప్రశ్నిస్తోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రాన్ని చూడటానికి , ఆ సినిమా ప్రమోషన్ లో పాల్గొనడానికి మాత్రం తీరిక చేసుకొని వెళ్ళారని కానీ మహిళల సమస్యలపై స్పందించడానికి మాత్రం మీకు తీరిక లేదా ? అంటూ మంత్రి కేటిఆర్ ని ప్రశ్నిస్తోంది శ్రీరెడ్డి . ఇప్పటికే నాలుగుసార్లు మీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నం చేసానని , మీ పిఎ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా , మెసేజ్ లు పెట్టినా స్పందన లేదని ఆరోపించింది శ్రీరెడ్డి .

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రాన్ని చూడటమే కాకుండా ఆ సినిమా ప్రమోషన్ లో ఇటీవల పాల్గొన్నాడు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు . ఎవరైనా మంత్రి ని ట్విట్టర్ లో సంప్రదిస్తే వెంటనే స్పందిస్తాడని పేరుంది కేటిఆర్ కు కానీ శ్రీరెడ్డి ట్విట్టర్ ని , ఫేస్ బుక్ ని ఆశ్రయించినప్పటికీ మంత్రి నుండి స్పందన లేదు అలాగే మంత్రి పిఎ కూడా స్పందించకపోవడంతో సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నిస్తోంది . మరి మంత్రి ఈ విషయం పై ఎలా స్పందిస్తాడో చూడాలి .