ఎన్టీఆర్ -చరణ్ లకోసం కష్టపడుతున్న జక్కన్న


ఎన్టీఆర్ – చరణ్ లు ఇప్పటివరకు తెలుగు లో మాత్రమే హీరోలు బెంగుళూర్ లో మన తెలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి కానీ మిగతా చోట్ల అంతగా ప్రభావం ఉండదు అలాగే తమిళనాడు తీసుకుంటే చెన్నై లో రిలీజ్ అవుతాయి తెలుగు సినిమాలు , ఇక ఓవర్ సీస్ అలాగే ఇతర దేశాల్లో కొన్ని కానీ దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఇప్పటివరకు ఈ ఇద్దరు హీరోలకు లేదు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ మాత్రమే క్రేజ్ ఉంది కానీ ఇప్పుడు అలా కాదు ఎన్టీఆర్ -చరణ్ లకు దేశ వ్యాప్తంగా అలాగే ఓవర్ సీస్ లో సైతం కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ రావాలని కంకణం కట్టుకున్నాడు జక్కన్న అలియాస్ ఎస్ ఎస్ రాజమౌళి .

బాహుబలి తర్వాత రాజమౌళి రేంజ్ కూడా ప్రపంచ వ్యాప్తం అయినా విషయం తెలిసిందే దాంతో ఆ క్రేజ్ ని ఫణంగా పెట్టి ఎన్టీఆర్ -చరణ్ ల కోసం కష్టపడుతున్నాడు . బాహుబలి లాంటి సినిమా ఆ స్థాయి వసూళ్లు సాధిస్తే కమర్షియల్ హంగులతో భారీ మల్టీస్టారర్ తో చేసే సినిమా కు ఏ స్థాయి ఉంటుందో చాటి చెప్పాలని భావిస్తున్నాడు జక్కన్న అందుకే ఎన్టీఆర్ -చరణ్ లతో చేసే సినిమాని తెలుగు , తమిళ , మలయాళ , హిందీ బాషలలో చేయబోతున్నాడు . దీనివల్ల ఖచ్చితంగా ఇతర బాషలలో ఈ హీరోల మార్కెట్ పెరగడం ఖాయమని అలాగే ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమాగా ఉన్నాడు జక్కన్న . ఇక ఎన్టీఆర్ – చరణ్ లు కూడా జక్కన్న ని బాగా నమ్ముతున్నారు ఎందుకంటే వాళ్లకు అతడితో ఉన్న బాండింగ్ అలాంటిది మరి .