షూటింగ్ పూర్తి చేసుకొన్న సుధాకర్ కొమాకుల “నువ్వు తోపురా”


Nuvvu Thopu Raa“లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” ఫేమ్ సుధాకర్ కొంత విరామం అనంతరం మళ్లీ వెండితెరపై కనువిందు చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం “నువ్వు తోపురా”. షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

 

ఈ సందర్భంగా హీరో సుధాకర్ కొమాకుల మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో నా పాత్ర అన్ని భావోద్వేగాలను కలగలిపి వినూత్నంగా ఉంటుంది, యువతరం తమని తాము ఈ పాత్ర లో చూసుకుంటారు. ఈ చిత్రం నాకు మరో మెట్టు పైకి ఎదిగేలా చేస్తుందని నమ్ముతున్నాను. నిర్మాతలకి ఈ చిత్రం మొదటిది అయినప్పటికీ కూడా ప్రేక్షకులకి ఒక మంచి చిత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో కథానుసారంగా ఉత్తమ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. తప్పకుండా ఈ చిత్రం తో ప్రేక్షకుల్లో మరియు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు సంపాదిస్తామని ఆశిస్తున్నాం” అన్నారు.

చిత్ర నిర్మాత డి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. “సుధాకర్ కోమాకుల-నిత్యాశెట్టిలు జంటగా రూపొందుతున్న “నువ్వు తోపురా” చిత్రీకరణ 70% అమెరికాలో, 30% ఇండియాలో షూట్ చేశాం. హాలీవుడ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న “నువ్వు తోపురా” టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మా దర్శకుడు హరినాధ్ బాబు.బి తెరకెక్కిస్తున్నారు. కృష్ణవంశీ-వైవిఎస్ చౌదరిల వద్ద శిష్యరికం చేసిన ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. షూటింగ్ పూర్తయ్యింది, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

 

నటీనటులు:
సుధాకర్ కొమాకుల, నిత్యాశెట్టి, నిరోష, రవివర్మ, శ్రీధరన్, దివ్యారెడ్డి, జెమిని సురేష్, దువ్వాసి మోహన్, ఫిష్ వెంకట్, కల్పలత, పద్మజ, జబర్దస్త్ రాకేష్, మహేష్ విత్తా, భాషా, మాస్టర్ సాత్విక్.