కోర్టు కి హాజరైన హీరో సుమంత్


sumanth attend court in check bounce caseఅక్కినేని నాగార్జున మేనల్లుడు హీరో సుమంత్ ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టు కి హాజరయ్యాడు . సుమంత్ తో పాటు అతడి సోదరి మాజీ హీరోయిన్ సుప్రియ కూడా హాజరయ్యింది . అసలు మార్కాపురం కోర్టు కి సుమంత్ , సుప్రియ లు రావడానికి కారణం ఏంటో తెలుసా …… బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన విక్కీ డోనర్ చిత్రాన్ని తెలుగులో ” నరుడా డోనరుడా ” అనే పేరుతో రీమేక్ చేసారు . కాగా ఆ ప్రాజెక్ట్ లో హీరో సుమంత్ కాగా నిర్మాణంలో కూడా వాటాదారుడిగా ఉన్నాడు .

ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సుమంత్ , సుప్రియ లు సదరు నిర్మాతలకు చెక్స్ ఇచ్చారు కానీ అవి బౌన్స్ కావడంతో ఆ నిర్మాతలు కోర్టు కెక్కారు . కోర్టు నోటీసులు ఇవ్వడంతో ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టు కి హాజరయ్యారు సుమంత్ , సుప్రియ లు . తమ న్యాయవాదులతో కలిసి కోర్టుకి హాజరు కాగా ఈ కేసు ని జూన్ 28 కి వాయిదా వేసింది మార్కాపురం కోర్టు . దాంతో మళ్ళీ సుమంత్ , సుప్రియ లు జూన్ 28న కోర్టు కి హాజరు కావాల్సి ఉంది . సుమంత్ హీరోగా పలు చిత్రాల్లో నటించాడు కానీ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేక పోయాడు అలాగే వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు .