వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన నటి


tamil actress sangeetha balan arrested in prostitution caseవ్యభిచారం కేసులో తమిళనటి సంగీత బాలన్ అరెస్ట్ అయ్యింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన తమిళనాడు లో జరిగింది . చెన్నై లోని పనయర్ ప్రాంతంలోని ఓ రిసార్ట్ లో జోరుగా వ్యభిచారం సాగుతొందని పోలీసులకు పక్కా సమాచారం అందడంతో రిసార్ట్ పై దాడులు నిర్వహించారు , వ్యభిచారం నిర్వహిస్తున్న సంగీత బాలన్ తో పాటుగా విటులను అలాగే యువతులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు .

అయితే వ్యభిచారానికి దిగిన యువతులను రేస్క్యు హోం కు తరలించగా , విటులతో పాటు నటి సంగీత బాలన్ ని కోర్టులో హాజరు పరిచారు , కాగా సంగీత కు రిమాండ్ విధించడంతో జైలు కు తరలించారు . 1996 లో విడుదలైన ”కరుప్ప రోజా ” అనే తమిళ చిత్రం తో నటిగా పరిచయం అయ్యింది సంగీత బాలన్ . సినిమాలతో పాటుగా టివి సీరియల్ లలో కూడా నటిస్తున్న సంగీత బాలన్ వ్యభిచారం కేసులో అరెస్ట్ కావడంతో తమిళ చిత్ర పరిశ్రమ షాక్ కి గురయ్యింది .