ఆవేశం మాములుగా లేదుగా


telugu film industry fire on tv5 editorనిన్న సాయంత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది , ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్లంతా వీరావేశంతో మాట్లాడారు . ఒక ఛానల్ డిబేట్ లో చిత్ర పరిశ్రమలోని మహిళలను దారుణంగా కించపరిచాడు దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు . లైవ్ డిబేట్ లో అనకూడని మాట అని మీడియా పరువు తీసాడు ఓ సీనియర్ జర్నలిస్ట్ దాంతో రచ్చ రచ్చ అవుతోంది .

ఇక నిన్నటి సమావేశంలో పాల్గొన్న శివాజీ రాజా , తమ్మారెడ్డి భరద్వాజ , ఎన్ . శంకర్ , రకుల్ ప్రీత్ సింగ్ , మంచు లక్ష్మి , హరీష్ శంకర్ , హేమ తదితరులంతా పాల్గొని సదరు యాంకర్ పై నిప్పులు చెరిగారు . క్యాండిల్స్ తో నిరసన కూడా తెలిపారు . వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు . ఇప్పటికే టివి 5 ఎడిటర్ పై కేసు కూడా పెట్టారు మా సభ్యులు . మరి ఈ వివాదం ఎప్పుడు కొలిక్కి వస్తుందో .