పెళ్లి చూపులు డైరెక్టర్ రెండో సినిమా రెడీ

పెళ్లి చూపులు చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తన రెండో సినిమాని రూపొందిస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ సినిమాకు పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా ……. ” ఈ నగరానికి ఏమైంది ”. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాని ఏప్రిల్ లో లేదా మేలో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు . మొదటి సినిమాతో సంచలన విజయం సాధించిన తరుణ్ భాస్కర్ రెండో సినిమాని కూడా సక్సెస్ చేస్తాడా ? చూడాలి .

ఎందుకంటే మొదటి సినిమా తో హిట్ కొట్టిన దర్శకులు రెండో సినిమా తో పరాజయం పొందిన దాఖలాలు ఉన్నాయి . మరి ఈ తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది తో ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో చూడాలి . అగ్ర నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు , ఇక ఈ సినిమాని వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నారు .