ఆ టైటిల్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయపడుతున్నారు


title sentiment strugles for ntr trivikram movieతాజాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే షూటింగ్ పార్ట్ ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతోంది కూడా దాంతో ఈ సినిమాకు ” అసామాన్యుడు ” అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు . అయితే వాళ్ళు అనుకున్న టైటిల్ లీక్ అయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తెలిసిపోయింది , ఇంకా అసామాన్యుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేయలేదు కానీ ఈ టైటిల్ అయితే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు అంతే !

ఎన్టీఆర్ సినిమాకు అసామాన్యుడు అనే టైటిల్ పెడుతున్నారని తెలిసిన అభిమానులు ఆ టైటిల్ పట్ల భయాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు అసలు అసామాన్యుడు అనే టైటిల్ వద్దంటూ గోల చేస్తున్నారు . కొంతమంది హార్డ్ కొర్ ఫ్యాన్స్ అసామాన్యుడు వద్దని పోరు కూడా పెడుతున్నారట . ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ టైటిల్ వద్దని ఎందుకు ఇంతగా భయపడుతున్నారో తెలుసా ……. ఎన్టీఆర్ నటించిన డిజాస్టర్ చిత్రం ” అశోక్ ” , అలాగే ఇటీవలే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ” అజ్ఞాతవాసి ” . ఈ రెండు చిత్రాలు కూడా ” అ” అక్షరంతో ప్రారంభం అవుతాయి రెండు కూడా డిజాస్టర్ లు అయ్యాయి దాంతో ఆ టైటిల్ వద్దని అంటున్నారట ! బ్యాడ్ సెంటిమెంట్ కదా అందుకు .