Home Topstories
TOLLYWOOD
 TOP STORIES

సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

26 ఏళ్ల క్రితం ద‌క్షిణాదిలో సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసిన చిత్రం `ద‌ళ‌ప‌తి`. సూప‌ర్ స్టార్స్ ర‌జ‌నీకాంత్‌, మ‌మ్ముట్టి కాంబినేష‌న్‌లో విడుద‌లైన ద‌ళ‌ప‌తి తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో తెలుగులో మ‌రో సినిమా విడుద‌ల‌వుతుంది. ఆది అక్షర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సదా  దర్శకత్వంలో బాబురావు పెదపూడి నిర్మించిన చిత్రం 'దళపతి`. సదా - కవితా అగర్వాల్ , బాబు - ప్రియాంక శర్మ రెండు జంటలుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు యాజ‌మాన్య సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పాట‌ల రికార్డింగ్ జ‌రుపుకుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాలో ఓ పాట‌ను ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేమా ఘోష‌ల్ పాడారు. సెల‌క్టివ్‌గా పాట‌లు పాడు శ్రేయా ఘోష‌ల్ తెలుగులో ఏడాది త‌ర్వాత పాడుతున్న పాట ఇది. `నీకు నాకు మ‌ధ్య ఏదో ఉందే...` అంటూ సాగే ఈ పాట‌ను శ్రేయా ఘోష‌ల్‌, యాజ‌మాన్య క‌లిసి ఆల‌పించారు.  ఈ పాట‌ను ఎఫ్‌.ఎం రేడియోలో విడుద‌ల చేశారు. ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.ఈ సందర్బంగా దర్శకులు సదా  మాట్లాడుతూ.. ``పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా పాటల రికార్డింగ్ జ‌ర‌గుతుంది. ఓ పాట‌ను ప్ర‌ముఖ సింగ‌ర్‌, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రేయో ఘోష‌ల్ పాడారు. ప‌రిమితంగా పాట‌లు పాడే శ్రేయోఘోష‌ల్‌గారు మా సినిమాలో పాడ‌టం ఆనందంగా ఉంది. మా యూనిట్‌ను ఆమె అభినందించారు. పాట‌ల‌న్నీ చాలా బాగా వచ్చాయి. యాజ‌మాన్య‌గారి సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. విభిన్న కథాంశం తో యాక్షన్ , ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న దళపతి చిత్ర షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. అలాగే ఛాయాగ్రాహకులు జై అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలవనుంది`` అన్నారు.నిర్మాత బాబురావు మాట్లాడుతూ..`అడ‌గ్గానే మా సినిమాలో పాట పాడ‌టానికి ఒప్పుకుని పాడిన శ్రేయా ఘోష‌ల్ గారికి థాంక్స్‌. పాట చాలా బాగా వ‌చ్చింది. ముఖ్యంగా శ్రేయా పాడిన పాట‌ను యూ ట్యూబ్ చానెల్స్‌లో విడుద‌ల చేశాం. ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. సినిమా మేం అనుకున్న‌ట్లు వ‌స్తుంది.   యాజమాన్య సంగీతం, జై సినిమాటోగ్ర‌ఫీ, స‌దా డైరెక్ష‌న్ ప్రేక్షకులను అలరించడం ఖాయం`` అన్నారు

పవన్ కొత్త సినిమా టైటిల్ ఇదేనట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో జల్సా , అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ లు వచ్చిన విషయం కూడా విదితమే . ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలిసి సినిమా చేస్తున్నారు.ఆ చిత్రానికి రకరకాల టైటిల్స్ అనుకున్నారు కానీ ఏది కూడా సెట్ కాలేదు . సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని టైటిల్ ని ఫిక్స్ చేసే పనిలో పడ్డారట ఆ చిత్ర బృందం. ఇంతకీ త్రివిక్రమ్ అనుకుంటున్న టైటిల్ ఏంటో తెలుసా ...... రాజు వచ్చినాడు. ఇదే టైటిల్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట . పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా కుష్భు కీలక పాత్రలో నటిస్తోంది.

సాయిధరమ్‌తేజ్‌ కె.ఎస్‌.రామారావు లభారీ చిత్రం ప్రారంభం

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు ప్రొడక్షన్‌ నెం.45గా నిర్మిస్తున్న భారీ చిత్రం పూజా కార్యక్రమాలు ఆగస్ట్‌ 16న హైదరాబాద్‌లోని ఫిలిం నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగాయి. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో హీరో సాయిధరమ్‌తేజ్‌, దర్శకుడు ఎ.కరుణాకరన్‌, సినిమాటోగ్రాఫర్‌ ఐ.ఆండ్రూ, మాటల రచయిత డార్లింగ్‌ స్వామి, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాహి సురేష్‌, ఎడిటర్‌ ఎస్‌.ఆర్‌.శేఖర్‌, నిర్మాత కె.ఎస్‌.రామారావు పాల్గొన్నారు.నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ - ''మా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో ఇది 45వ సినిమా. ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విజయదశమి రోజున ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈరోజు మా సినిమా కార్యక్రమాలు మొదలయ్యాయి. మా డైరెక్టర్‌గారు మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో వున్నారు. డైలాగ్‌ రైటర్‌ డార్లింగ్‌ స్వామి మాటలు రాస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నామని చెప్పడానికి మీ ముందుకు వచ్చాం. ఈరోజు ఉదయం 8.20 గంటలకు మా చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. మా హీరో సాయిధరమ్‌ తేజ్‌తో సినిమా చెయ్యడం అంటే మా కుటుంబంలో ఒక యంగ్‌స్టర్‌తో చేస్తున్న ఫీలింగ్‌ నాకు వుంది. ఈ సినిమా ప్రారంభం కావడానికి సాయిధరమ్‌తేజ్‌ కృషి ఎక్కువగా వుంది. ఇంతకుముందు మా బేనర్‌లో వాసు చిత్రాన్ని చేసిన రుణాకరన్‌గారు చెప్పిన సబ్జెక్ట్‌ తేజుకి నచ్చి ఈ సినిమా రామారావుగారైతే బాగా చేస్తారని నన్ను పిలిచి మీ డైరెక్టర్‌గారితో మీరు మంచి సినిమా తియ్యండి అని మంచి స్క్రిప్ట్‌ని నాకు అందించినందుకు మా హీరో సాయిధరమ్‌తేజ్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా డైరెక్టర్‌గారు కళ్యాణ్‌బాబుతో చేసిన సినిమాలైనా, ఎవరితో చేసిన సినిమాలైనా పవిత్రమైన ప్రేమ, సిన్సియర్‌ ప్రేమ వున్న మంచి సినిమాలు తీశారు. ఆయన తీసిన సినిమాలన్నీ మంచి ప్రేమతో నిండి వుంటాయి. అటువంటి మా కరుణాకరన్‌గారితో మళ్ళీ ఓ మంచి లవ్‌స్టోరీ, మ్యూజికల్‌ హిట్‌తో మీ ముందుకు వస్తున్నందుకు ఎంతో ధైర్యంగానూ, మరెంతో నమ్మకంగానూ వుంది. ఆల్రెడీ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. డైరెక్టర్‌గారు ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తో గోపీసుందర్‌గారు రెండు అద్భుతమైన ట్యూన్స్‌ చేశారు. మా డైరెక్టర్‌గారు చాలా మంచి సినిమా తీసి ఇస్తారన్న నమ్మకం నాకు వుంది. ఆయనకు కావాల్సినవన్నీ సమకూర్చే స్తోమత, దమ్ము, ధైర్యం వున్న ప్రొడ్యూసర్‌ని కాబట్టి నాకెలాంటి ప్రాబ్లమ్‌ లేదు. మా డైరెక్టర్‌గారికి చాలా ఇష్టమైన ఆండ్రూస్‌ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఇక డైలాగ్‌ రైటర్‌ డార్లింగ్‌ స్వామితో కరుణాకరన్‌ చాలా సినిమా చేశారు. ఇంత మంచి టీమ్‌తో చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.దర్శకుడు ఎ.కరుణాకరన్‌ మాట్లాడుతూ - ''తేజుతో సినిమా చేస్తున్నందుకు చాలా ఎక్సైటెడ్‌గా వున్నాను. ఇది పూర్తిగా లవ్‌స్టోరీ. కలర్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో జాలీగా వుండే సినిమా ఇది'' అన్నారు.హీరో సాయిధరమ్‌తేజ్‌ మాట్లాడుతూ - ''సంవత్సరం నుంచి రామారావుగారు, నేను ఒక ప్రాజెక్ట్‌ చేద్దామనుకుంటున్నాం. కానీ, కథ సెట్‌ అవ్వలేదు. ఎవరి దగ్గరకి ఏ కథ వెళ్ళాలనేది ముందే రాసి పెట్టి వుంటుందని చాలా మంది చెప్పారు. అలా కరుణాకరన్‌గారి కథ నాకు రాసి పెట్టి వుందని నేను అనుకోలేదు. కానీ, అలా కుదిరింది. కరుణాకరన్‌గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆల్‌మోస్ట్‌ నాకు మరో మావయ్య. నేరేషన్‌ టైమ్‌లో ఈ కథ విని ఎంత ఎంజాయ్‌ చేసానో షూటింగ్‌ టైమ్‌లో దాన్ని మించి ఎంజాయ్‌ చేస్తానని నమ్మకం వుంది. మా యంగ్‌, డైనమిక్‌, ఎనర్జిటిక్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావుగారితో వర్క్‌ చేయడం చాలా ఆనందంగా వుంది. ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. మా యంగ్‌ జనరేషన్‌తో కూడా సినిమా చేస్తున్నారంటే ఎంత స్టాండర్డ్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారో అర్థమవుతుంది. తప్పకుండా ఆయనకి ఒక మంచి సినిమా ఇస్తామని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను'' అన్నారు.

నితిన్ పోరి కి ఛాన్స్ లు మస్తుగా వస్తున్నయ్

నితిన్ సరసన లై చిత్రంలో నటించిన అందాల ముద్దుగుమ్మ '' మేఘా ఆకాష్ '' కు ఛాన్స్ లు మస్తుగా వస్తున్నయ్ . చామన ఛాయలో మెరిసిపోతున్న ఈ భామ కి ఫిదా అయిపోతున్నారు దర్శక నిర్మాతలు , అలాగే హీరోలు కూడా . చూడ చక్కగా ఉన్న ఈ భామ నిజంగానే లక్కీ గర్ల్ అనే చెప్పాలి . ఎందుకంటే లై సినిమా సక్సెస్ కాలేదు కానీ చాన్స్ లు మాత్రం వస్తూనే ఉన్నాయి.ఇప్పటికే తమిళ్ లో రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ భామకు తెలుగులో ఏకంగా అరడజను సినిమాలు వచ్చాయట ! అయితే అవన్నీ ఓకే చేయలేదు , అలాగే కొన్ని లైన్ లో ఉన్నాయి . వాటిలో కథ , హీరో , బ్యానర్ , దర్శకుడు అంటూ ఏరికోరి ఎంచుకుంటోందట ఈ భామ . వస్తున్న ఛాన్స్ లను సరిగ్గా వినియోగించుకుంటే తప్పకుండా తెలుగులో మేఘా ఆకాష్  స్టార్ హీరోయిన్ అవడం ఖాయం.

ఆ డైరెక్టర్ మంచి చిత్రాలే చేసాడు కానీ

చంద్రశేఖర్ ఏలేటి మంచి దర్శకులే , ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలు కూడా ఫరవాలేదనిపించాయి , అందులో కొన్ని మంచి చిత్రాలు ఉన్నాయి కానీ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం లో వచ్చిన ఏ సినిమా కూడా కమర్షియల్ గా హిట్ కాలేదు , నిర్మాతలకు లాభాలు రాలేదు దాంతో ఇతగాడి కి ఎప్పుడో ఒక సినిమా వస్తుంది . దర్శకుడి గా పరిచయం అయి 14 ఏళ్ళు కానీ దర్శకత్వం వహించిన చిత్రాలు మాత్రం ఏడు మాత్రమే !.అయితే అలాంటి ఈ దర్శకుడి తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు ఫిలింనగర్ లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి . ఎన్టీఆర్ అంటే మాస్  , చంద్రశేఖర్ ఏలేటి క్లాస్ మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే బాక్సాఫీస్ ని షేక్ చేసేలా ఉండాలి , లేకపోతే అది ఎన్టీఆర్ పై ఎఫెక్ట్ పడటం ఖాయం . ఎన్టీఆర్ ఇతడి తో పని చేయడం అంటే పెద్ద రిస్క్ తీసుకున్నట్లే !ఎన్టీఆర్  రిస్క్ తీసుకుంటాడా ? లేదా ? చూడాలి.

చిరంజీవి కొత్త సినిమా మొదలయ్యింది

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఈరోజు  ప్రారంభమైంది . మంచి ముహూర్తం ఉండటం తో ఈనెల 22వరకు ఆగకుండా వెంటనే ఈరోజు ప్రారంభించారు . ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిరంజీవి దంపతులు , అల్లు అరవింద్ , చరణ్ , దర్శకులు సురేందర్ రెడ్డి లతో పాటు పరుచూరి బ్రదర్స్ హాజరయ్యారు . అసలు ఈ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి చిత్రాన్ని మొదట తన 150 వ చిత్రంగా చేయాలనీ అనుకున్నాడు చిరు .   కానీ భారీ బడ్జెట్ పైగా ఎక్కువ రోజుల పాటు షూటింగ్ చేయాల్సి వస్తుండటంతో ఉయ్యాలవాడ ని వాయిదా వేశారు . కట్ చేస్తే ఖైదీ నెంబర్ 150 పెద్ద హిట్ కావడం 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు . తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందనుంది ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం .

నెపోలియన్ కొత్తగా ఉన్నట్లుందే

నెపోలియన్ చిత్ర ట్రయిలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. నీడ ఎక్కడో తప్పిపోయింది అంటూ హీరో పోలీసులను ఆశ్రయించడం కొత్త కాన్సెప్ట్ గానే ఉంది . ఆనంద్ రవి కథ , మాటలు  ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం వహిస్తూ హీరోగా కూడా నటించాడు.   నీడ తప్పిపోయింది అన్న కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ట్రైలర్ బాగుంది మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

సాయిధరమ్‌తేజ్‌ కొత్త చిత్రం ప్రారంభం

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు ప్రొడక్షన్‌ నెం.45గా నిర్మిస్తున్న భారీ చిత్రం పూజా కార్యక్రమాలు ఆగస్ట్‌ 16న హైదరాబాద్‌లోని ఫిలిం నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగాయి. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో హీరో సాయిధరమ్‌తేజ్‌, దర్శకుడు ఎ.కరుణాకరన్‌, సినిమాటోగ్రాఫర్‌ ఐ.ఆండ్రూ, మాటల రచయిత డార్లింగ్‌ స్వామి, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాహి సురేష్‌, ఎడిటర్‌ ఎస్‌.ఆర్‌.శేఖర్‌, నిర్మాత కె.ఎస్‌.రామారావు పాల్గొన్నారు.  నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ - ''మా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో ఇది 45వ సినిమా. ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విజయదశమి రోజున ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈరోజు మా సినిమా కార్యక్రమాలు మొదలయ్యాయి. మా డైరెక్టర్‌గారు మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో వున్నారు. డైలాగ్‌ రైటర్‌ డార్లింగ్‌ స్వామి మాటలు రాస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నామని చెప్పడానికి మీ ముందుకు వచ్చాం. ఈరోజు ఉదయం 8.20 గంటలకు మా చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. మా హీరో సాయిధరమ్‌ తేజ్‌తో సినిమా చెయ్యడం అంటే మా కుటుంబంలో ఒక యంగ్‌స్టర్‌తో చేస్తున్న ఫీలింగ్‌ నాకు వుంది. ఈ సినిమా ప్రారంభం కావడానికి సాయిధరమ్‌తేజ్‌ కృషి ఎక్కువగా వుంది. ఇంతకుముందు మా బేనర్‌లో వాసు చిత్రాన్ని చేసిన రుణాకరన్‌గారు చెప్పిన సబ్జెక్ట్‌ తేజుకి నచ్చి ఈ సినిమా రామారావుగారైతే బాగా చేస్తారని నన్ను పిలిచి మీ డైరెక్టర్‌గారితో మీరు మంచి సినిమా తియ్యండి అని మంచి స్క్రిప్ట్‌ని నాకు అందించినందుకు మా హీరో సాయిధరమ్‌తేజ్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా డైరెక్టర్‌గారు కళ్యాణ్‌బాబుతో చేసిన సినిమాలైనా, ఎవరితో చేసిన సినిమాలైనా పవిత్రమైన ప్రేమ, సిన్సియర్‌ ప్రేమ వున్న మంచి సినిమాలు తీశారు. ఆయన తీసిన సినిమాలన్నీ మంచి ప్రేమతో నిండి వుంటాయి. అటువంటి మా కరుణాకరన్‌గారితో మళ్ళీ ఓ మంచి లవ్‌స్టోరీ, మ్యూజికల్‌ హిట్‌తో మీ ముందుకు వస్తున్నందుకు ఎంతో ధైర్యంగానూ, మరెంతో నమ్మకంగానూ వుంది. ఆల్రెడీ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. డైరెక్టర్‌గారు ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తో గోపీసుందర్‌గారు రెండు అద్భుతమైన ట్యూన్స్‌ చేశారు. మా డైరెక్టర్‌గారు చాలా మంచి సినిమా తీసి ఇస్తారన్న నమ్మకం నాకు వుంది. ఆయనకు కావాల్సినవన్నీ సమకూర్చే స్తోమత, దమ్ము, ధైర్యం వున్న ప్రొడ్యూసర్‌ని కాబట్టి నాకెలాంటి ప్రాబ్లమ్‌ లేదు. మా డైరెక్టర్‌గారికి చాలా ఇష్టమైన ఆండ్రూస్‌ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఇక డైలాగ్‌ రైటర్‌ డార్లింగ్‌ స్వామితో కరుణాకరన్‌ చాలా సినిమా చేశారు. ఇంత మంచి టీమ్‌తో చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.  దర్శకుడు ఎ.కరుణాకరన్‌ మాట్లాడుతూ - ''తేజుతో సినిమా చేస్తున్నందుకు చాలా ఎక్సైటెడ్‌గా వున్నాను. ఇది పూర్తిగా లవ్‌స్టోరీ. కలర్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో జాలీగా వుండే సినిమా ఇది'' అన్నారు.  హీరో సాయిధరమ్‌తేజ్‌ మాట్లాడుతూ - ''సంవత్సరం నుంచి రామారావుగారు, నేను ఒక ప్రాజెక్ట్‌ చేద్దామనుకుంటున్నాం. కానీ, కథ సెట్‌ అవ్వలేదు. ఎవరి దగ్గరకి ఏ కథ వెళ్ళాలనేది ముందే రాసి పెట్టి వుంటుందని చాలా మంది చెప్పారు. అలా కరుణాకరన్‌గారి కథ నాకు రాసి పెట్టి వుందని నేను అనుకోలేదు. కానీ, అలా కుదిరింది. కరుణాకరన్‌గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆల్‌మోస్ట్‌ నాకు మరో మావయ్య. నేరేషన్‌ టైమ్‌లో ఈ కథ విని ఎంత ఎంజాయ్‌ చేసానో షూటింగ్‌ టైమ్‌లో దాన్ని మించి ఎంజాయ్‌ చేస్తానని నమ్మకం వుంది. మా యంగ్‌, డైనమిక్‌, ఎనర్జిటిక్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావుగారితో వర్క్‌ చేయడం చాలా ఆనందంగా వుంది. ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. మా యంగ్‌ జనరేషన్‌తో కూడా సినిమా చేస్తున్నారంటే ఎంత స్టాండర్డ్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారో అర్థమవుతుంది. తప్పకుండా ఆయనకి ఒక మంచి సినిమా ఇస్తామని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను'' అన్నారు.  సాయిధరమ్‌తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించే ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌ సి.ఎస్‌., సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేష్‌, కాస్ట్యూమ్స్‌: రత్నాజీ, మేకప్‌: కె.ఎస్‌.కిరణ్‌కుమార్‌, స్టిల్స్‌: వెంకట్‌ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీష్‌ కొప్పినీడి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌ వి., నిర్మాతలు: కె.ఎస్‌.రామరావు, కె.ఎ.వల్లభ, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.​

నాగచైతన్య కొత్త సినిమా పేరు ఏంటో తెలుసా

అక్కినేని నాగచైతన్య తాజాగా మైత్రి మూవీస్ సంస్థ లో సినిమా చేయడానికి అంగీకరించాడు . చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సరికొత్త టైటిల్ ని ఫిక్స్ చేసారు . ఇంతకీ ఆ టైటిల్ ఏంటో తెలుసా ....... '' సవ్య సాచి '' . మహాభారతంలో అర్జునుడికి ఈ సవ్య సాచి అనే బిరుదు ఉంది . విభిన్న కథా చిత్రాల దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అప్పుడే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి .   ఈరోజు అధికారికంగా సవ్య సాచి అనే టైటిల్ ని ప్రకటించనున్నారు మైత్రి మూవీస్ అధినేతలు . మహేష్ తో శ్రీమంతుడు , ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ లను అందించిన మైత్రి మూవీస్ సంస్థ నుండి వస్తున్న చిత్రం కావడంతో సవ్య సాచి పై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం . 

జగన్ పై సెటైర్ వేసిన వేణు మాధవ్

నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని కాకపోతే ఎంత మెజారిటీ వస్తుందో తెలుసుకోవడానికే నంద్యాల కు వచ్చానని జగన్ పై సెటైర్ వేసాడు హాస్య నటుడు వేణు మాధవ్ . తెలుగుదేశం పార్టీ కోసం మొదటి నుండి కష్టపడుతున్న వేణు మాధవ్ తాజాగా ఉప ఎన్నికల ప్రచారం కోసం నంద్యాల వెళ్ళాడు . తెలుగుదేశం పార్టీ ని గెలిపించేది జగన్ అని బాంబ్ పేల్చాడు .     ప్రతీ రోజు చంద్రబాబు నాయుడు ని జగన్ అదే పనిగా విమర్శిస్తూ మా విజయాన్ని ఖాయం చేసాడని ఇక ఇప్పుడు మిగిలి ఉంది కేవలం ఎంత మెజారిటీ అనేది మాత్రమే నని జగన్ పై సెటైర్ వేసాడు వేణు మాధవ్ . నంద్యాల లో తెలుగుదేశం - వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లు హోరా హోరీ గా తలపడుతున్న విషయం తెలిసిందే . మరి ఈ పోటీలో గెలిచేది ఎవరో . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..