ఎవరికైనా 175 కంపెనీస్ ఓపెన్ చెయ్యడం సాధ్యమా
TOLLYWOOD
 TOPSTORY

ఎవరికైనా 175 కంపెనీస్ ఓపెన్ చెయ్యడం సాధ్యమా

Murali R | Published:September 12, 2017, 12:00 AM IST
ఎవరికైనా 175 కంపెనీలను ఓపెన్ చేయడం సాధ్యమా ? సాధ్యమే అని  అంటున్నారు అగ్రి గోల్డ్ వ్యవస్థాపకులు , అనటమేకాదు ఓపెన్ చేసి CID వాళ్లకు లిస్ట్ కూడా  ఇచ్చారు . ప్రజల దగ్గర 9,000 కోట్లు కొల్లగొట్టి, దానిని నేరపూరిత మార్గాలకు మళ్లించడానికి నెలకు ఒక కంపెనీ చొప్పున 175 కంపెనీలు ఓపెన్ చేసారు. అందులో ఒకటి TOLLYWOOD TV Channel.  ఇప్పుడు ఆ 175 కంపెనీలను కొనడానికి Essel Group ( Zee TV ) సంస్థ ముందుకు వచ్చింది. ఇందులో సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి వాటా ఎంతో చంద్ర బాబు నాయుడు వాటా ఎంతో ?
 
 
 
36 లక్షల అగ్రి గోల్డ్ బాధితులులో ఇప్పటి వరకు 150 మంది ఆత్మ హత్య చేసుకొన్నారు. ఆత్మ హత్య చేసుకొన్న వాళ్ళందిరికి  Essel Group ( Zee TV ) నష్టపరిహారం చెల్లిస్తుందా ? గత రెండేళ్లుగా న్యాయం కోసం అగ్రిగోల్ద్ బాధితులు చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు . రోడ్ల మీదకు వచ్చి ధర్నా లు , రాస్తారోకో లు చేస్తూనే ఉన్నారు ఇక ప్రభుత్వం బాధితులందరికీ న్యాయం చేస్తామని చెబుతూ ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్పితే ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు . ఇప్పటికే 150 మందిని అగ్రిగోల్ద్ పొట్టన పెట్టుకుంది . మరికొంతమంది దిక్కు లేని వారయ్యారు కానీ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు . ఇక టాలీవుడ్ చానల్ పై ట్రేడ్ మార్క్ కేసు ఉంది అది కూడా ఇంతవరకు కొలిక్కి రాలేదు అగ్రిగోల్ద్ బినామీ సంస్థ అయిన టాలీవుడ్ చానల్  ని ఎప్పుడో మూసేయ్యాల్సి ఉంది కానీ ప్రాపకం కోసం ఇంకా రన్ చేస్తూనే ఉన్నారు . న్యాయం నాలుగు పాదాల మీద నడుస్తున్న నవ భారతం అంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్పితే న్యాయం మాత్రం దక్కడం లేదు . సామాన్య జనం పైసా పైసా కూడబెట్టి పిల్లల చదువుల కోసమని , ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసమని అగ్రిగోల్ద్ లో పెట్టుబడి పెడితే , రెక్కల కష్టం అంతా పెద్దలు తన్నుకు పోయేలా ఉన్నారు తప్ప పేదవాడికి న్యాయం జరిగే తీరు మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు .Comments

FOLLOW
 TOLLYWOOD