స్పైడర్ వల్ల ఎన్ని కోట్ల నష్టమో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

స్పైడర్ వల్ల ఎన్ని కోట్ల నష్టమో తెలుసా

Murali R | Published:October 12, 2017, 10:08 AM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా స్పైడర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మొదటి రోజు నుండే డివైడ్ టాక్ తో అనూహ్య పరాజయం పొందింది. మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది ఈ స్పైడర్. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 120 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్పైడర్ ని సొంతం చేసుకోవడానికి బయ్యర్లు పోటీపడ్డారు దాంతో బిజినెస్ అనూహ్యంగా 175 వరకు వెళ్ళింది. 
 
 
175 కోట్ల బిజినెస్ జరుగగా అందులో శాటిలైట్ కె 30 కోట్లు వచ్చాయి. అంటే 145 కోట్లు ఏరియాల వారీగా వచ్చాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల తో పాటుగా ఓవర్సీస్ లో  కూడా భారీ నష్టాలు వస్తున్నాయి స్పైడర్ ని కొనుక్కున్న వాళ్లకు. మొత్తంగా ఎన్ని కోట్ల నష్టమో తెలుసా 95 కోట్ల కు పైగానే . బయ్యర్లంతా 95 కోట్ల నష్టాన్ని ఎలా భరించాలా అని తలపట్టుకున్నారు. మహేష్ కెరీర్ లోనే బ్రహ్మోత్సవం డిజాస్టర్ కాగా అంతకు మించి స్పైడర్ డిజాస్టర్ అయ్యింది. భారీ నష్టాలను మిగిల్చింది. Comments

FOLLOW
 TOLLYWOOD