డిజాస్టర్ ని మిస్ చేసుకున్న అఖిల్
TOLLYWOOD
 TOPSTORY

డిజాస్టర్ ని మిస్ చేసుకున్న అఖిల్

Murali R | Published:August 13, 2017, 12:00 AM IST
నితిన్ హీరోగా నటించిన లై సినిమా లో మొదటగా నటించాల్సింది అక్కినేని అఖిల్ మాత్రమే . అవును హను రాఘవపూడి ఈ లై కథ ని అఖిల్ కు చెప్పడం అతడికి నచ్చడం చకా చకా జరిగిపోయాయి . అయితే హను ఈ సినిమాని 14 రీల్స్ వాళ్లకు చేయాలి కానీ అక్కినేని కాంపౌండ్ మాత్రం కుదరదు అని అనేసింది దాంతో అఖిల్ లై ని చేజార్చుకున్నాడు . అయితే అప్పట్లో ఈ విషయం మీద పాపం అఖిల్ ని ఆడిపోసుకున్నారు అందరూ .
 
 

అఖిల్ మంచి సినిమా చేజార్చుకున్నాడు అని , కట్ చేస్తే మొన్న రిలీజ్ అయిన లై డిజాస్టర్ అయ్యింది . హను చెప్పిన కథ , 14 రీల్స్ నిర్మాణం , నితిన్ , అర్జున్ ల యాక్టింగ్ ప్రేక్షకులకు నచ్చలేదు ...... దాంతో ప్లాప్ అయ్యింది సినిమా . అంటే డిజాస్టర్ సినిమా నుండి అఖిల్ బయటపడినట్లే కదా ! అఖిల్ ఈ సినిమా చేసి ఉంటే మరో డిజాస్టర్ చేతిలో ఉండేది . కొద్దిలో మిస్ అయ్యింది . 
Comments

FOLLOW
 TOLLYWOOD