మాస్ కు నచ్చేలా ఉంటుందట ఆ సినిమా
TOLLYWOOD
 TOPSTORY

మాస్ కు నచ్చేలా ఉంటుందట ఆ సినిమా

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు , మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ తనయుడు అయిన నిఖిల్ కుమార్ గౌడ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం ''జాగ్వార్ '' . ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తిచేసుకుంది కాగా అక్టోబర్ 6 న జాగ్వార్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక సెన్సార్ రిపోర్ట్ ప్రకారం జాగ్వార్ కమర్షియల్ గా భారీ  స్థాయిలో కాకపోయినా బిసి కేంద్రాల్లో అక్కడి ప్రేక్షకులు మెచ్చే లాగే ఉందని అంటున్నారు . తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రం 75 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది . మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ సరసన దీప్తి నటించగా తమన్నా ఐటెం సాంగ్ లో మెరిసింది . జగపతి బాబు , రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు . 
Comments

FOLLOW
 TOLLYWOOD