లై రివ్యూ
TOLLYWOOD
 TOPSTORY

లై రివ్యూ

Murali R | Published:August 11, 2017, 12:00 AM IST
నటీనటులు : నితిన్ , అర్జున్ , మేఘా ఆకాష్ 

సంగీతం : మణిశర్మ 

నిర్మాణం : 14 రీల్స్ 

దర్శకత్వం : హను రాఘవపూడి 

రేటింగ్ : 2/ 5

రిలీజ్ డేట్ : 11 ఆగస్టు 2017

నితిన్ - అర్జున్ ల కాంబినేషన్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రం '' లై ''. ఈరోజు మూడు చిత్రాలు పోటీపడి మరీ రిలీజ్ అయ్యాయి . మరి అందులో లై విజయం సాధించిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 

కథ : 

క్రిమినల్ పద్మనాభన్ (అర్జున్ ) కోసం ఇండియన్ పోలీసులు సెర్చ్ చేస్తున్న సమయంలో ఇండియా నుండి తప్పించుకొని అమెరికా పారిపోతాడు . అతడ్ని పట్టుకోవడానికి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు ఇండియన్ పోలీసులు . అయితే అదే సమయంలో పని పాట లేని సత్యం  ( నితిన్ ) పెళ్లి కోసం  అమెరికా వెళ్తాడు . అక్కడికి వెళ్ళాక పద్మనాభన్ ఆపరేషన్ లో భాగం అవుతాడు . అసలు సత్యం ఎవరు ? పద్మనాభన్ కోసం ఎందుకు వెతుకుతున్నాడు ? చివరకు పద్మనాభన్ సత్యం చేతికి చిక్కాడా ?అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

హైలెట్స్ : 

నితిన్ 

మేఘా ఆకాష్ 

డ్రా బ్యాక్స్ : 

కథ 

కథనం 

ఎంటర్ టైన్మెంట్ 

నటీనటుల ప్రతిభ: 

సత్యం గా నితిన్ నటన బాగుంది , అలాగే తన పాత్ర మేరకు సరికొత్త మేకోవర్ లో కనిపించి ఆకట్టుకున్నాడు . అర్జున్ విలన్ గా మెప్పించాడు . మేఘా ఆకాష్ అందంగా ఉంది , అలాగే అందాలను చూపించి కురాళ్లకు గాలం వేసింది . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు . 

సాంకేతిక వర్గం : 

మణిశర్మ అందించిన పాటలకంటే రీ రికార్డింగ్ బాగుంది , అలాగే రెండు పాటలు కూడా బాగున్నాయి . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు హను రాఘవపూడి విషయానికి వస్తే ....... ఏదో చెప్పాలనుకొని ఏదో తీసినట్లుగా ఉంది . భారీగా ఖర్చు పెట్టించి పరమ చెత్త సినిమాని తీసాడు . ఏ దశలో కూడా సినిమా ఆకట్టుకునే స్థాయిలో లేదు . అసలు ఏమి చెప్పి నటీనటులను , నిర్మాతలను ఒప్పించాడో తెలీదు కానీ పరమ చెత్త సినిమాని తీసాడు . 

ఓవరాల్ గా : 

లై సినిమాకు వచ్చినందుకు తలపట్టుకోవడం ఖాయం . 
Comments

FOLLOW
 TOLLYWOOD