నేనేరాజు నేనే మంత్రి రివ్యూ
TOLLYWOOD
 TOPSTORY

నేనేరాజు నేనే మంత్రి రివ్యూ

Murali R | Published:August 11, 2017, 12:00 AM IST
నటీనటులు : రానా , కాజల్ అగర్వాల్ , కేథరిన్ 

సంగీతం : అనూప్ రూబెన్స్ 

నిర్మాత : సురేష్ బాబు 

దర్శకత్వం : తేజ 

రేటింగ్ : 2. 5/ 5

రిలీజ్ డేట్ : 11 ఆగస్టు 2017

రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '' నేనేరాజు నేనే మంత్రి ''. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 

కథ : 

వడ్డీ వ్యాపారి అయిన జోగేంద్ర ( రానా ) కు రాధ ( కాజల్ అగర్వాల్ ) అంటే ప్రాణం . అయితే రాధ కోరిక మేరకు రాజకీయాల్లోకి వస్తాడు జోగేంద్ర . ఒక్కొక్కరిని తొక్కేస్తూ తనకు అడ్డు వస్తున్న వాళ్ళని చంపేస్తూ రాజకీయ చదరంగం ఆడతాడు కట్ చేస్తే అదే రాజకీయ చదరంగంలో పావుగా మారతాడు జోగేంద్ర . చివరకు ఆ క్రీడ లో ఎవరిని కోల్పోయాడు ? చివరకు అతడి జీవితం ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

హైలెట్స్ : 

రానా 

డ్రా బ్యాక్స్ : 

క్లైమాక్స్ 

నటీనటుల ప్రతిభ : 

జోగేంద్ర గా రానా అద్భుతంగా నటించాడు , కాజల్ అగర్వాల్ పాత్ర కూడా సమర్థవంతంగా పోషించింది . రానా - కాజల్ అగర్వాల్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది . ఇక నెగెటివ్ షేడ్ లో  కేథరిన్ మెప్పించింది . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు . 

సాంకేతిక వర్గం : 

లక్ష్మి భూపాల్ అందించిన మాటలు బాగున్నాయి , అలాగే పాటలు కూడా . సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత అందాన్ని ఇచ్చింది . అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం సినిమాకు మరింత వన్నె తెచ్చింది . దర్శకులు తేజ విషయానికి వస్తే ....... రాజకీయ నేపథ్యంలో ప్రేమకథ ని జోడించి మెప్పించాడు . చాలాకాలంగా సక్సెస్ లేక సతమతం అవుతున్న తేజ ఈ సినిమాతో ఆ లోటు భర్తీ చేయనున్నాడు . 

ఓవరాల్ గా : 

చక్కటి ప్రేమ కథ కు రాజకీయ నేపథ్యాన్ని జోడించి న నేనేరాజు నేనే మంత్రి ప్రేక్షకులను అలరించేలా రూపొందింది . 
Comments

FOLLOW
 TOLLYWOOD