నితిన్ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడా
TOLLYWOOD
 TOPSTORY

నితిన్ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడా

Murali R | Published:October 26, 2017, 10:29 AM IST
ఇటీవలే లై సినిమాతో ఘోర పరాజయం అందుకున్నాడు నితిన్ , అయినప్పటికీ హీరోయిన్ మేఘా ఆకాష్ ని తన తదుపరి సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నాడు . లై సినిమాలో ఇద్దరి జోడీ బాగుంది కానీ సినిమా బాగోలేకపోవడంతో ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది . అయితే ఇద్దరి మధ్య మాత్రం మంచి కెమిస్ట్రీ కుదిరింది దాంతో తన తదుపరి సినిమాలో కూడా మేఘా ఆకాష్ నే తీసుకున్నాడు నితిన్ . లై సినిమా కోసం అమెరికాలో ఏకంగా 70 రోజుల పాటు ఉన్నారు దాంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు అప్పట్లోనే పుకార్లు షికారు చేసాయి . 
 
 
తాజాగా కృష్ణ చైతన్య సినిమా కోసం మేఘా ఆకాష్ తో రొమాన్స్ చేస్తున్నాడు నితిన్ దాంతో మరింతగా దగ్గరయ్యారట మానసికంగా అందుకే త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి . నితిన్ ని లవ్ చేస్తోంది కాబట్టే హీరో రామ్ సరసన నటించే ఛాన్స్ వస్తే ఆ సినిమాని నిరాకరించింది మేఘా ఆకాష్ . ఇక ఈ సినిమా తర్వాత నితిన్ - మేఘా ఆకాష్ పెళ్లి అనే అంటున్నారు . ఏమో ! ఈ వార్తలను ఖండిస్తారో లేక నిజమే ! అని అంటారో చూడాలి .Comments

FOLLOW
 TOLLYWOOD