రాజరథం పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్
TOLLYWOOD
 TOPSTORY

రాజరథం పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్

Murali R | Published:October 18, 2017, 7:48 PM IST

నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా తమిళ్‌ హీరో ఆర్య ప్రత్యేక పాత్రలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న డిఫరెంట్‌ మూవీ 'రాజరథం'. 'రంగితరంగ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ టీమ్‌ అజయ్ రెడ్డి గొల్లపల్లి, అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్‌ శాస్త్రి, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

ఇటీవల ఈ చిత్రంలోని ఆర్య ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేసింది 'రాజరథం' టీమ్‌. అయితే ఈ పోస్టర్‌ డిజైన్‌ పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రం నుంచి కాపీ చేయబడిందని మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. దీనిపై 'రాజరథం' టీమ్‌ ఈ విధంగా స్పందించింది. ''ఈ వార్త ఎలా, ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. మేం అక్టోబర్‌ 12న ఈ పోస్టర్‌ను విడుదల చేశాం. మీడియాలో వచ్చిన న్యూస్‌లో 17న 'రాజరథం' పోస్టర్‌ వచ్చినట్టు పేర్కొన్నారు. కానీ, అది నిజం కాదు. ఎందుకంటే ఆ పోస్టర్‌లోని స్టిల్‌ను సెప్టెంబర్‌లో తియ్యడం జరిగింది. మా టీమ్‌కి టెక్నికల్‌గా వున్న బలంతో మేం క్రియేట్‌ చేసిన వర్క్‌ అది. మాకు తెలిసి వేరొకరి క్రియేటివిటీని మేం ఎక్కడా కాపీ చెయ్యలేదు. మేం రిలీజ్‌ చేసిన పోస్టర్‌ వెనుక ఎంతో మంది కష్టం, ఎంతో ప్లానింగ్‌ వుంది. కొన్ని నెలల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ బోర్డ్‌ రెడీ చెయ్యడం జరిగింది.

 

మేం ఈ చిత్ర పోస్టర్ స్టిల్స్ కోసం హ్యాసల్‌బ్లాడ్‌ కెమెరాను వాడాం. ప్రముఖ బాలీవుడ్‌ కెమెరామెన్‌ మనీష్‌ ఠాకూర్‌ ఈ ఫోటోలను తీశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా మా దగ్గర వుంది. తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త తరహా అనుభూతిని కలిగించేందుకు మేం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా దర్శకుడు అనూప్‌ భండారి, మా డిజైన్‌ టీమ్‌ 'కాని స్టూడియో' ఈ పోస్టర్‌ను మా తొలి తెలుగు చిత్రం 'రాజరథం' కోసం క్రియేట్‌ చేశారు. మాకు పవన్‌కళ్యాణ్‌గారంటే ఎంతో గౌరవం వుంది. వారిని, వారి టీమ్‌ని అగౌరవ పరచాలన్న ఉద్దేశం మాకు లేదు. మేం రిలీజ్‌ చేసిన పోస్టర్‌ కాపీ చేసింది కాదని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాం. 
Comments

FOLLOW
 TOLLYWOOD