రాజమౌళి కి అగ్ని పరీక్ష
TOLLYWOOD
 TOPSTORY

రాజమౌళి కి అగ్ని పరీక్ష

Murali R | Published:September 7, 2017, 12:00 AM IST
ఓటమి ఎరుగని దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మొదటిసారి గా అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నాడు. రాజమౌళి చూడని హిట్ అంటూ లేదు కానీ తొలిసారిగా ఓ ఇద్దరు హిట్ కొడితే చూడాలని ఉప్పొంగిపోవాలని ఆశపడుతున్నాడు. అందుకే రాజమౌళి విపరీతమైన టెన్షన్ లో ఉన్నాడట . ఇంతకీ రాజమౌళి ఇంతగా ఎందుకు టెన్షన్ పడుతున్నాడో తెలుసా ....... ఎవరి కోసం టెన్షన్ పడుతున్నాడో తెలుసా ........ ఒకరు కన్నతండ్రి విజయేంద్ర ప్రసాద్ కోసం మరొకరు కొడుకు ఎస్ ఎస్ కార్తికేయ కోసం.

ఈ ఇద్దరి గురించి టెన్షన్ ఎందుకంటే ......... విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన  శ్రీవల్లి ఈనెల 15న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. విజయేంద్ర ప్రసాద్ స్టార్ రైటర్ అన్న విషయం తెలిసిందే. అయితే డైరెక్టర్ గా సక్సెస్ కావాలని అతడి ఆశ , ఆశయం కూడా  కానీ ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక ఇప్పుడు శ్రీవల్లి తో మరో ప్రయోగం చేస్తున్నాడు. ఇక తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ విషయానికి వస్తే ........ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన యుద్ధం శరణం చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు . మొదటిసారి గా ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. పైగా ఆ సినిమా రేపే రిలీజ్ దాంతో ఎస్ ఎస్ రాజమౌళి టెన్షన్ గా ఉన్నాడు. రెండూ హిట్ కావాలని ఇద్దరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాడు. అయితే రెండూ హిట్ అవుతాయా ? ఇద్దరూ సక్సెస్ అవుతారా ? రాజమౌళి టెన్షన్ తీరిపోతుందా అంటే రేపు ఒక ఫలితం తెలిపోనుంది . సగం టెన్షన్ పోనుంది.

Related Links

SS Rajamouli supports his Father
SS Rajamouli liked Balakrishnas look in Paisa Vasool
Ramcharan teamup with Rajamouli


Comments

FOLLOW
 TOLLYWOOD