విన్నర్ సెన్సార్ పూర్తి ఈ నెల 24న గ్రాండ్ గా విడుదల
TOLLYWOOD
 TOPSTORY

విన్నర్ సెన్సార్ పూర్తి ఈ నెల 24న గ్రాండ్ గా విడుదల

Murali R | Published:February 17, 2017, 12:00 AM IST
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో  న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధుఈ చిత్రాన్నినిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎలాంటి కట్స్ లేకుండా యు బై ఏ సర్టిఫికెట్ పొందడం విశేషం. ఇప్పటికే చిత్ర ట్రైలర్ కు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు సైతం చిత్ర యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తడం మరో విశేషం. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మేమంతా ఊహించినట్టుగానే ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తయింది. యు బై ఏ సర్టిఫికెట్ పొందిన విన్నర్ కు సెన్సార్ సభ్యుల నుంచి మంచి స్పందన లభించింది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది. అని అన్నారు. 

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, ఆలీ, వెన్నెల‌ కిశోర్ త‌దిత‌రులుఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: త‌మ‌న్‌, ఆర్ట్: ప్ర‌కాష్‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌,మాట‌లు: అబ్బూరి ర‌వి, నృత్యాలు: రాజు సుంద‌రం, శేఖ‌ర్‌, ఫైట్స్: స్ట‌న్ శివ‌, ర‌వివ‌ర్మ‌, ఎడిట‌ర్‌: గౌత‌మ్ రాజు, స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం:గోపీచంద్ మ‌లినేని.




Comments

FOLLOW
 TOLLYWOOD