మాజీ పెళ్ళాం పుట్టినరోజు వేడుకలో మాజీ మొగుడు
TOLLYWOOD
 TOPSTORY

మాజీ పెళ్ళాం పుట్టినరోజు వేడుకలో మాజీ మొగుడు

Murali R | Published:October 11, 2017, 7:46 PM IST
రీనా దత్ ని  బాలీవుడ్ హీరో    అమీర్ ఖాన్1989 లో పెళ్లి చేసుకున్నాడు ,ఆ ఇద్దరి కాపురానికి గుర్తుగా  ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 12 ఏళ్ల కాపురం తర్వాత 2002 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కిరణ్ రావ్ ని పెళ్లి చేసుకున్నాడు అమీర్ ఖాన్. 

 

 

కాగా ఇటీవల అమీర్ మొదటి భార్య రీనా దత్ 50 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. దాంతో ఆ వేడుకలకు అమీర్ ఖాన్ హాజరై రీనా దత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయడమే కాకుండా ఆ వేడుకలో హల్చల్ చేసాడు. మాజీ పెళ్ళాం పుట్టినరోజు వేడుకలలో మాజీ మొగుడి సందడి భలేగా ఉంది అంటూ గుసగుసలాడుకున్నారు పలువురు. మొత్తానికి మొదటి భార్య కు విడాకులు ఇచ్చినప్పటికీ ఇంకా వాళ్ళు మంచి స్నేహితులుగానే ఉంటున్నారు . 
Comments

FOLLOW
 TOLLYWOOD